ఎదురీత..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఎదురీత..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఎదురీత..!(కవిత)

ఎన్ని సమస్యలు 
ఎదురైనా.,
ఎన్ని కష్టాలు చుట్టూ ముట్టినా.,
బాధల కడగండ్లు కింద మీదేసినా.,
ఎన్ని ఇబ్బందులు వదలని జిగట పట్టీలైనా.,
వద్దు..వద్దు,
అధైర్యం వద్దు..!
ఆత్మవిశ్వాసమే ముద్దు..!
ఆత్మ నిబ్బరమే ముద్దు..!
అడుగేయాలి తెగువతో..!
ముందుకెళ్ళాలి వీరోచితంగా..!
పోరాడాలి చివరి వరకు..!
గెలిచి తీరాలి తుద వరకైనా..!??
సమస్యలు నిన్ను చూసి భయపడాలి..!?
ఆందోళనలు నీ దగ్గరకు రావడానికి వెనుకాడాలి..!?
నీ "ఎదురీత" కు ఉప్పెనలే నిర్వీర్యం అయి పోవాలి..!?
కష్టాల కడలిలో నీ
వీరోచిత గెలుపు ఖరారు అయికూచోవాలి..!?  
నీ మొండితనం నీ విజయంగా మారి తీరుతుంది..!
నీవొక "విజేత"గా నిలవడం ఖాయం..! సోదర..
పద ముందుకు..!,ఇక
 ఏం శంకించకు..!?
👍👍👍👍👍👍❤️🙏

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments