" ముత్యాల హారాలు " - గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

" ముత్యాల హారాలు " - గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

" ముత్యాల హారాలు "
-------------------------------
దైవానికి మందిరము
మానవుని చిరు హృదయము
చేసుకొనాలి శుద్ధము
ఆపుకొనాలి మలినము

చూపాలి కనికరము
అదెంతో అవసరము
వదలాలి కలవరము
చాటాలి పనితనము

పలకాలోయ్ సత్యము
ఉండాలోయ్ నిత్యము
కావాలోయ్ ముత్యము
అందరికి  అగత్యము

చిన్నారుల మనసులు
సుతిమెత్తని చిగురులు
పాలకడలి తరగలు
వెన్నెలమ్మ సొబగులు

పసి పిల్లలు మల్లెలు
తొలకరి చిరుజల్లులు
నింగిని హరివిల్లులు
మమతల పొదరిల్లులు


-గద్వాల సోమన్న ,
     ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments