సమస్యల లోకం..!(కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

సమస్యల లోకం..!(కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

సమస్యల లోకం..!(కవిత)

పెరిగిపోతున్న సమస్యలు..!
తరిగిపోతున్న మానవ విలువలు..!
అమానుష, దారుణ, మారణ కాండలో... 
లోకం తల్లడిల్లుతోంది..!??
జీవితానికి అర్థం లేకుండా పోతోంది..!??
ద్వేషం, పగ ప్రతీకారాలు ఎక్కువయ్యాయి..!
ఒకరినొకరు చంపుకోడాలు హద్దు మీరి అశాంతి,అభద్రతలు
సమాజంలో 
రాజ్యమేలుతున్నాయి..!??
అర్ధనగ్న ప్రదర్శన లో స్త్రీలు హద్దు మీరిపోయారు..!??
నిండుదనం ఆశించి చెబితే..స్త్రీకి స్వేచ్ఛ లేదని వాపోతున్నారు..!??
స్త్రీలపై మానభంగాలు జరిగితే రక్షణ లేదంటారు..!
అన్ని రకాలుగా సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి..!
పరిష్కారం కాదు కదా..
కనీస చర్యలు కూడ అవ్వడం లేదు..!??
కుల, మత విద్వేషాల అగ్ని నిండు ప్రాణాల్ని 
దహించి వేస్తోంది..!
ఇంకోవైపు ప్రకృతి రకరకాలుగా 
విలయాలు సృష్టిస్తోంది..!

--విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments