రక్షాబంధన్ - మార్గం కృష్ణ మూర్తి

రక్షాబంధన్ - మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

అంశం: రక్షాబంధన్

(అమ్మలోని మొదటి అక్షరం "అ" , నాన్న లోని చివరి అక్షరం "న్న" ని కలుపుతే వచ్చే వచ్చే పదం  "అన్న")

ప్రక్రియ: మణిపూసలు
(రూపకర్త: వడిచర్ల సత్యం)

పూర్వకాలమందునుండె
దేవత రాక్షసులకుండె
పుష్కరకాలము యుద్దము
ఇది అనాదిగ వస్తుండె!

యుద్దాల నడ్డుకొన
తమను రక్షించుకొన
దేవతలు రాఖి కట్టిరి 
ఇంద్రుడి కుడి చేతిన!

ఇంద్రుడికి శక్తి వచ్చె
దేవతలను రక్షించె
అదియేశ్రావణపూర్ణిమ
మూడు లోకాలు మెచ్చె!

అదే ఆనవాయితిగను
నేడు కొనసాగుతుండెను
సోదరి తన సోదరులకు
రాఖీని కట్టు చుండెను!

ఆపదల్లో ఉన్నపుడు
రాఖి కడుతే సోదరుడు
తమను రక్షించుతాడు
అనే విశ్వాసముమెండు!

సోదరులు బహుమానమును
సోదరిమణులకిచ్చియును
సాగనంపును  సోదరిని
నదియె రాఖి పౌర్ణమియును!
            ....***....

- మార్గం కృష్ణ మూర్తి

0/Post a Comment/Comments