వాట్సాప్ - ఆన్లైన్ లు --మార్గం కృష్ణ మూర్తి

వాట్సాప్ - ఆన్లైన్ లు --మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: వాట్సాప్ - ఆన్లైన్ లు

నీరు పల్లమెరుగు
నిజం దేవుడెరుగు
సాహితీ కవుల పరుగు
సాహితీ సంస్థలకాయే మెరుగు!

కరోనా కాలం, జనాలు హా హా కారం
జనాలయ్యారు  వాట్సప్ కే పరిమితం
అడ్రసులులేని సాహితీసంస్థలకుఅవకాశం
ఆనందోత్సాహాలతో సాహిత్య జనం!

సంస్థలు పరస్పర సహాకారమంటుండే
సంకలనాలనివందలు వేలు గుంజుతుండే
బుక్కులు,షీల్డ్ లుశాల్వాలుపంపిస్తాననుండే
ఏమైందని అడిగే సరికి మొఖం చాటేస్తుండే
రిజిష్టర్డయిన సంస్థల విలువ పోతుండే!

పేర్లు , చరవాణి నెంబర్లు , ఆడ్రసులు
ఫోటోలు ,జీపే నెంబర్లు ,తల్లిదండ్రుల పేర్లు
తల్లి గారి ఇంటి పేర్లు ,పిల్లలపేర్లు వృత్తులు
ఆడుగు తుండే,ఉత్సాహంగా పంపిస్తుండే!

గౄపులలో యేల తెలుసు ఎవరేమిటనేది
సాహితీ కవులపర్సనల్ డాటాకు రక్షణేది 
భారతీయ సాహితీప్రియులకు రక్షణేది
రిజిష్టర్డయినసాహితీసంస్థలకుగౌరవమేది!

డాటా సేకరిస్తుందని చైనాఆప్ లరద్దు చేసి
ఆన్లైన్ విధానాలకు తెరతీసి
ఆన్లైన్ కొనుగోలుఅమ్మకాలకుఎదురుచూసి
పర్సనల్ డాటానంతా మనమే చేరవేస్తిమి!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
బ్యాంక్ బ్యాలెన్స్ ఊడ్చుక పోయాక
జనులుమొత్తుకుంటే ప్రయోజనమేముంది
జేబులుఖాళీఅయ్యాకఆవేదనేకదా మిగిలేది!

అయినా రెండు చేతులు కలుస్తేనే
చప్పుడవుతుంది కదానోయ్
ప్రశంసా పత్రాలకు ఎగబడు తుంటే
యికను జరుగేది అదే కదానోయ్

మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments