ఓ మనిషి భవితను కాపాడుకో

ఓ మనిషి భవితను కాపాడుకో

ఓ మనిషి భవితను కాపాడుకో

మట్టిని నేనని చిన్నగా చూడకు
మీకు కావలసినవి ఎన్నో అందించాను
నాలో విత్తు వేస్తే చక్కని ఫలాలను అందించాను
చక్కని పాడిపంటలు ను అందించాను
అందమైన పూలవనాలు అందించాను
పచ్చని ప్రకృతిని అందించాను
మీకు నీడను ఇచ్చే చెట్లను అందించాను
మీ గృహోపకరణాలుకు
పనికి వచ్చే కలపను అందించాను
చల్లని నీడను అందించడానికి సహకరించాను
మీకు కావలసిన నిత్యావసరాలును ఎన్నో అందించాను
నన్ను నేను హింసించుకుని
నా గుండెను చీల్చి మీకు
తోడుగా నీడగా ఉండేవి ఎన్నో అందించాను
మీకే కాదు సమస్త జీవకోటికి
కావలసినవన్ని నా శక్తి మీరా సమకూర్చాను
నేనెప్పుడూ స్వార్థం గా లేను
అయినా నాపై చెత్తలు వేస్తున్నారు
ప్లాస్టిక్కుని వేసి నా ఉదరాన్ని
నింపి సారం లేకుండా చేస్తున్నారు
విష వ్యర్ధ పదార్ధాలతో నన్ను హింసిస్తున్నారు
ఇది మీకు తగునా అన్నం పెట్టిన అమ్మని 
అధఃపాతాళనికి అణగదొక్కి మీకు మీరే సమాధి ని కట్టుకుంటున్నారు.
చివరకు మీరు కలిసేది కూడా నాలోనే
ఇకనైనా నన్ను నా బాధను అర్ధం చేసుకోండి 
తెలుసుకోండి తెరుకోండి
భవితను కాపాడుకోండి

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
           సాలూరు టీచర్ 
           విజయనగరం జిల్లా
           సాలూరు

0/Post a Comment/Comments