బతుకు పోరులో నేతన్న -- డా వి.డి రాజగోపాల్

బతుకు పోరులో నేతన్న -- డా వి.డి రాజగోపాల్

 బతుకు పోరులో నేతన్న


నేతన్న మనకు బట్టలు నేసే నేస్తం
ఎన్ని పోగులు పోగుచేసి నేస్తే కదా!
ఓ చీరో ఓ దోవతో తయారయ్యేది
ప్రతి పోగుపై పెడతాడు ప్రాణం
మనకు తన కళ్ళను ఎరగా పెట్టి
అందమైన బట్టలు నేస్తాడు

"కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల
పసిడిదాన"............
అంటూ చివరి చరణం లో
"గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం
ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల
నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది" .....
నేతన్నపై మన ఆత్రేయ స్పందన అది

కాలం మారింది
వస్త్రాలు నేసే మిల్లులు వచ్చే
నేతన్నల కడుపు కొట్టే
ఆ వృత్తి మానలేక
పొట్ట గడవక
కుటుంబ పోషణ చేయలేక
ఉరి తాడు మెడతాడై
కుటుంబాన్ని కన్నీటి పాలు చేసి
జీవన పోరాటంలో ఓడిన నేతన్న
మగ్గపు గుంతలు వద్దని ఘోషించాడు

నేతన్నలకు పని కలిపించలేమా
వారంలో ఒకరోజు
అందరం చేనేతలు వాడితే
నేతన్న కడుపు నిండదా

ఎందరో బీదలు పండగ పబ్బానికి
కొత్త బట్టలకు నోచుకోని బతుకులు
కనీసం ఏడాదికి ఒక్క మారు
వారికి చీర దోవతి ఉచితంగా ఇస్తే
నేతన్నలను ఆదుకోవచ్చు
మన తమిళ సోదరులు ఈ వితరణ చూపుతున్నారు
పాలకులారా ఆలోచించండి
జాతీయ చేనేతల దినోత్సవం నేడు
వారికి జేజేలు పలుకుదాం....

-- డా వి.డి. రాజగోపాల్


 

0/Post a Comment/Comments