స్వాతంత్ర్య దినోత్సవం..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

స్వాతంత్ర్య దినోత్సవం..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

స్వాతంత్ర్య దినోత్సవం..!(కవిత)


వీరుల త్యాగ ఫలం..!
ధీరుల త్యాగ ఫలం..!
బానిస సంకెళ్ళ తెంపరికం,
ఎన్నో ఏళ్ల దాపరికం,
ఎన్నో పోరాటాల ఫలితం,
ఎన్నెన్నో ఉద్యమాల చరితం,
పొందెను భారత మాత స్వేచ్ఛా స్వాతంత్ర్యం..!!
ఆగస్టు పదిహేను ఆ సుదినం..!!!

బ్రిటీషు అరాజకాలకు తిలోదకం..!
అమానుష,అమానవీయ,
అన్యాయముల అసాంఘికం..!!
చిత్ర హింసలు ఆద్యంతం,
అమానుష దారుణ హత్యల పర్వం, భారత మాతను దోచుకొని దాచుకోవడం..,
ఇదే ఇదే..
బ్రిటీషు దొరల రాజరికం..!
దేశ భక్తుల,దేశ ప్రేమికుల బలిదానాల ఫలితం..!
పొందెను నేడు భరత మాత..స్వేచ్ఛా స్వాతంత్ర్యం..!!

దేశ పౌరుల కళ్ళలో నిజమైన 
ఆనందం..!
పీడ తొలగి,నీడ దొరికి,మదిలో సంతోషం..!
స్వేచ్ఛా జీవులుగా పరిణామం..,
ఆగస్టు పదిహేను ఆ సుదినం..!!
అందరి నోళ్లలో ఒకటే నినాదం..!
బోలో భారత్ మాతా కీ జై..!
బోలో స్వాతంత్ర్య భారత్
 కీ జై..!
దేశ్ నేతా కీ జై..!
దేశ్ షహీద్ కీ జై..!

అందరికీ స్వాతంత్య్ర
దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments