గృహమే స్వర్గం(అక్షరక్రమకవిత) డా.రామక కృష్ణమూర్తి

గృహమే స్వర్గం(అక్షరక్రమకవిత) డా.రామక కృష్ణమూర్తి


గృహమే స్వర్గం(అక్షరక్రమకవిత)
---డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.


జనుల జీవనమునకు
నగిషీలు అద్దిన,
వాసాలే ఆధారమైన,
సదనములే సరియగు,
ముఖ్య భూమికలగును.
దమ్మముగా నిల్చిన,
రవికాంతులమరగ,
హాయి గొల్పుచుండగా,
సతతము తోడై,
ముదము కూర్చును.
కలకాలము నిల్చునట్లు,
మదికి నచ్చునట్లు,
నీడను ఇచ్చునదదే.
యశము కల్గించి,
ముఖము తానై,
రాజిల్లును గాదె.0/Post a Comment/Comments