నీకు నాకు తెలియని నిజమిది... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

నీకు నాకు తెలియని నిజమిది... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

నీకు నాకు తెలియని నిజమిది

నీళ్ళు నడుస్తాయి
నీళ్ళు ఏడుస్తాయి 
నీళ్ళు నవ్వుతాయి
నీళ్లు నిద్రపోతాయి
నీళ్ళు ఎగురుతాయి
నీళ్ళు పరుగులుతీస్తాయి

నీవు నీళ్లలో మునిగి
పైకి తేలాలనుకుంటావు 
నీవు నీళ్ళ పైన పడుకుంటావు 
నీవు సజీవమైతేనే అది సాధ్యం

నీవు నిర్జీవమైతే నీటిలో మునగలేవు
నీటిపై తేలియాడూతూ ఉండాల్సిందే 
లేదంటే అలలొచ్చి ఛీఛీ పోపో అంటూ
గడ్డిపోచలా నీకట్టెను గట్టుకువిసిరేస్తాయి

కనిపించినప్రతిదాన్ని 
కాల్చివేయడం నిప్పుచేసే తప్పు 
అందుకే నీళ్లంటే నిప్పుకు భయం 
కానీ ఆ నీళ్ళే మనిషికి జీవనాధారం
ఆ నీళ్లే నిప్పైతే మనిషి బ్రతుకు నరకం

పాపం సముద్రంలోని 
ఆ నీళ్లకేం తెలుసు? అవిఏడుస్తాయని...
తాము ఎవరి దాహం 
తీర్చలేని నిస్సహాయులమని 
కడలి కడుపులోనే కలకాలముండాలని 

పాపం సముద్రంలోని 
ఆ నీళ్లకేం తెలుసు ?అవి పరుగులు తీస్తాయని...
తాము తీరందాటితే ప్రళయమేనని
ఎన్నో ప్రాణాలు "హరీ" అంటాయని 
ఊళ్ళుఊళ్ళే ఊడ్చిపెట్టుకుపోతాయని

పాపం సముద్రంలోని 
ఆ నీళ్లకేం తెలుసు ? అవి ఎగురుతాయని...
అప్పుడప్పుడు ఆకాశానికి విహారయాత్రకెళ్లాలని 
మేఘాల్లో దాక్కోవాలని విశ్వమంతా విస్తరించాలని 

పాపం సముద్రంలోని 
ఆ నీళ్లకేం తెలుసు ? అవి నవ్వుతాయని...
చిటపటమంటూ చినుకులైరాలి నేలపై ప్రవహించాలని 
సాగు త్రాగు నీరై పశువుల పక్షుల రైతుల పంట పొలాల 
సృష్టిలోని సకల జీవరాశుల దాహార్తిని తీర్చాలని
 
పాపం నీళ్లు అమాయకంగా అడుగుతున్నాయి 
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగన్నది నిజమేనా అని
నిజమేనంటే నీళ్ళు నవ్వి నడక ప్రారంభించాయి నింగివైపు 

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments