ఆహా! ఏమి కనువిందు -డా వి.డి.రాజగోపాల్

ఆహా! ఏమి కనువిందు -డా వి.డి.రాజగోపాల్



ఆహా! ఏమి కనువిందు

ఆహా! ఏమి కనువిందు,
ఇంత అందాల పసందు
ఎవరి కోసమో కదా!
భూమాత తన ప్రియుని కోసం
సింగారించు కొందా
తన సిగనిలా,
ఏమో అలానే ఉంది,

తన  సిగలో పూల పరిమళాలు,
మదనుని బాణంవలె
మేఘనాథుని  చేరాయేమో,

ప్రియురాలి చేర
బిరబిరా పయనమయ్యాడు
ఆ మేఘనాథుడు,
తన  అశ్వజంటలు ఘీంకరిస్తున్నాయా అన్నట్లు
ఆకాశాన ఉరుములు

ఆవేగంతో వచ్చే మేఘనాథుని రథం రాపిడి
అగ్ని జ్వాలలై మెరుపు మెరిసిందా!
అన్నరీతిన ఆకాశంలో మెరుపులు

భూమాత ఆనందంతో
తాండవం చేయగా
తన అడుగుల
కదలికకు చెట్లన్ని లయబద్దంగా
అటు ఇటు ఊగుతుంటే
మలయమారుతి
విలయతాండవం చేస్తుందా అన్నట్లు హోరున గాలి వీచె

ఆ వీచే గాలిచే మేఘనాథుని అణువణువు
కరిగిపోయి
జలధారల చిట పటలతో
భూమాతను చేరి
కాసేపు ఇరువురి ప్రణయలీలతో
ప్రకృతి పరవశించిందా అన్నట్లుంది
చూశారా పూల సొగసు ఎంత పనిచేసెనో

-డా వి.డి.రాజగోపాల్
9505690690



 

0/Post a Comment/Comments