ఎన్నికల సంస్కరణలు - మార్గం కృష్ణ మూర్తి

ఎన్నికల సంస్కరణలు - మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: ఎన్నికల సంస్కరణలు

తెల్ల దొరల నెదిరించి 
గుండె నెదురు నిలిపి
అహింసా వాదంతో, పరుగులు పెట్టించి
సాధించిరి స్వాతంత్ర్యం,మనమహాత్ములు!

మచ్చుకైన కానరావు నాటి పోకడలు
దోచుకుంటూ పోతుండిరి, దోపిడి నేతలు!

స్వాతంత్ర్యం వచ్చి, ఏడు దశాభ్ధాలైనా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ధనికులు కుబేరులైరి ,పేదలు నిరుపేదలైరి!

జనాల మాయజేయ జరుగు జగమెల్ల
ఐదేళ్ళకొకసారి ఎన్నికల జాతర 
పిల్లలకు ముద్దులు ,వనితలకు వందనాలు
అబ్బో ఉత్త (ర) ఉపాన్యాసాల హోరు
ఆపై డబ్బు పంపకాల జోరు
ఎంతో వినూతనం మరెంతో ఆర్భాటం
కానీ....ఫలితం శూన్యం

నేరస్తుల, అవినీతి పరుల పోటీకి,
రంగులు మార్చే ఊసరవెళ్ళులకు,
ఎనబైయేండ్ల నేతలకు ఓటు వేద్దామా
ఎన్నికలఖర్చుపై నియంత్రణింకాచూద్దామా

గెలిచే సత్తాలేనపుడు రెండుచోట్ల పోటా?
జాలి ఓట్లతో గెలిస్తే , అదీగెలుపేనా?
ఐదేండ్ల సేవలకు, 65 యేండ్లు పెన్సన్లా?
నేతల జీతాలకు,పెన్సన్లకు  పన్నులేవి?
సదుపాయాలకు పరిమితు లేవి?

అఫిడవిట్లకువాస్తవఆస్తులకుపొంత నుండాలి
బినామి చట్టాలు ఆమలు కావాలి
అసమర్ధనేతల,వెనుక్కేపిలిచేహక్కుండాలి
హామీల అమలుచేయకుంటే నేరమవ్వాలి!

ఎన్నికల సంస్కరణలు జరుగాలి
అవినీతిని అడుగడుగునా అరికట్టాలి
ప్రజల ఆర్ధిక అసమానతలు తొలగాలి
పేదల జీవితాల్లో  వెలుగు నింపాలి
ప్రగతి బాటన దేశం సాగి పోవాలి!

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments