మినీ కథ: సాహస పయనం ---సత్య మొండ్రేటి

మినీ కథ: సాహస పయనం ---సత్య మొండ్రేటి


సాహస పయనం
    
దేవ దేవ్......రాజీవ్  గాంధీ  ఇంటర్నేషనల్  ఏర్ పోర్ట్ లో  అమెరికా  నుండి  ఇండియా కు  లాండ్ అయ్యాడు.స్వదేశానికి   వచ్చిన  సంతోషంతో  అతని  మనసు  ఆనందపు ఊయలలో   ఊగుతుంది. లగేజ్ చెక్ అవుట్  చేసుకుని  బయటకు  వచ్చిన  దేవదేవ్   జనం  తన వైపు  వస్తుండటం చూసి  వాళ్ళు  తన  ఊరి  వాళ్ళు గా  గుర్తించాడు.

 
వచ్చిన వాళ్లంతా  దేవదేవ్ ని పలకరించి  క్షేమ సమాచారాలు  అడిగి తెలసుకున్నారు.దేవ్ కా
ర్లో కూర్చుని ఊరికి  బయలు దేరాడు.

"బాబాయ్.. తాతయ్య.. ఎలా ఉన్నా రు.." కార్లో  ఉన్న ఆయనను అడిగాడు దేవ్.
"నీ రాక కోసం  వేయి కళ్ళతో  ఎదురు చూస్తున్నారు బాబూ..నానమ్మ తాతయ్యలు.

 ఊరు విశేషాలు గురించి మాట్లాడు కుంటూ ఊరు  చేరారు..  ఎప్పటికప్పుడు  వీడియో ల్లో  తన  ఊరు  అభివృద్ధిని  చూస్తున్నా  , ప్రత్యక్షంగా  తన  ఊరు ని ,ఊరు లోని  మార్పును  చూసి  గర్వంగా ఫీలయ్యాడు దేవదేవ్.

ఇల్లు  చేరగానే  ఆతృత గా   తాతయ్య నానమ్మ ల కోసం
వెతికాయి  దేవదేవ్  కళ్ళు.మనవడి  కి  దిష్టి   తీయించి
లోపలికి ఆహ్వానించారు తాతయ్య నానమ్మ లు.

తాతయ్య నానమ్మ ల‌ కాళ్ళ కు నమస్కరించాడు

మానవడి ని  లేవతీసి గుండె కు  హత్తుకుంటూ...   ...

"దేవా...మేము  నిన్ను చూడగలమా. ...అనుకున్నాం  కన్నా... నువ్వు  వచ్చే వరకు  మా ప్రాణాలు  నిలుస్తాయి అనుకుంటూ  బ్రతికాం.. రా.. భగ వంతుడుమా మొర విన్నాడు...మా దేవ్ ని మాకు చూపించాడు.ఆర్తి  గా  దేవ్  తల నిమురుతూ అన్నారు ఆ వృద్ద దంపతులు.  

పండు టాకుల్లా ఉన్న  వాళ్ళ ను  పొదివి పట్టుకుని......

"తాతయ్యా నానమ్మా  మిమ్మల్ని  వదలి  ఇంక  ఎక్కడికి వెళ్ళను. ఇన్నాళ్లు మన ఊరి  అభివృద్ది కోసం  డబ్బు  సంపదించటానికి  దేశాలు పట్టుకుని తిరిగాను. ఇపుడు మన సమస్యల్ని   పరిష్క రించుకుని  హ్యాపీ  గా ఉ న్నాం."అన్నాడు దే వ దేవ్.

తాతయ్య నాన్నమ్మలు "మా శేషజీవితాన్ని  నీతో  గడపాలి. కన్నా....అదే  మా  చివరి కోరిక" అంటూ  మనవడిని హక్కున  చేర్చుకున్నారు.

*        *         *         *           *            *          *      *

దాదాపుగా  ఇరవై సంవత్సరాల  క్రితం జరిగిన సంఘటన... ... తీర ప్రాంతంలో   ప్రకృతి  స్వర్గం లా ఉన్న పల్లెటూరు. చక్కని పంటపొలాలు తో  పండ్ల తో టలతో  పూల తోటలతో   మనిషి  మనుగడ ను  ఆహ్లాదకరం గా మలచిన  అందమైన ఊరు అది. ఆలాం టి ఊరు కి  ఆపద వచ్చింది.అందమైన జీవితాల్ని  చిధ్రం చేసింది.ప్రకృతి  మాతకు ఆఊరి  పై కోపం  వచ్చి విలయ తాండవం చేసింది.ఫలితం  గా   ఉప్పెన   వచ్చి  ఊరు  వల్లకాడు చేసి  పోయింది.ఊరు వారి ఆస్తులతో పాటు   ఆప్తులను  కోల్పోయారు. మిగిలిన  వారు మనుగడ ప్రశ్న గా మిగిలింది.. అలాంటి  పరిస్తితుల్లో ..... దేవదేవ్  తాతయ్య పట్టాభిరమయ్యగారు నానమ్మ జానకమ్మ గారు  ఊరి ప్రజలకు  అండగా నిలిచారు.

ధైర్యంగా పరిస్థితి  ని  అందరూ  ఐకమత్యం తో  ఎదుర్కొ నారు.పట్టాభి రామయ్యగారు  కొడుకుకోడలు  మనవలు   వుప్పెన లో  కలిసిపోయారు. నడిరాత్రి వచ్చిన వుప్పెనకు నిద్ర  లోనే  బలై పోయారు ఊరి జనం. దేవ్  తల్లితండ్రులు  ఉ ప్పెన  లో   కొట్టుకు పోయారు.దేవ్  తల్లిదండ్రుల ది  ప్రేమవివాహం కావటం ,ఇరువైపుల పెద్దవాళ్ళ గురించి తెలియక పోవటం తో  దేవ్  అనాధ  గా మిగిలాడు.ఊరి వారికి  అతడి ని  ఏసేవ  సంస్థకు  ఇవ్వటానికి  ఇష్ట పడలేదు.

కొడుకు కుటుంబాన్ని కోల్పోయిన  పట్టాభి రామయ్య గారు ముందుకు వచ్చి  దేవ్  ని  దత్తత  చేసుకున్నారు. దేవ్ ఊరు అందరికీ కూడా దత్త పుత్రుడు. నెమ్మదిగా  వారు నిలదొక్కుకుని..దేవ్ ని చదివించారు. దేవ్ ని చదువించటనికి ఊరి వారంతా ప్రతి రోజు ఎవరికి తోచినట్లు వారు డబ్బు జమ చేసేవారు... అలా చదివి పెరిగి పెద్దవాడై...ఊరి వారికి  అండగా నిలబడ్డాడు దేవ్. ఊరుని అభివృద్ధి చేసుకోవడం కోసం  దేశ విదేశాలన్నీ తిరిగి  డబ్బు  సంపాదించి ఊరిని  ఊరు లోని ప్రజలను అభివృద్ది పరచాడు.  

ప్రభుత్వ సాయం తీసుకోకుండా  తన కష్టం తో ప్రజల అండదండలతో తన ఊరిని  దేశం లోనే  ఉత్తమ గ్రామం గా తీర్చి దిద్దాడు.పల్లె సీమ లే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు దేశానికి  వెన్నెముక అన్న మహాత్మా గాంధీ గారి మాటలను నిజం చేస్తూ  ముందుకు  పయనించాడు దేవదేవ్.

*  సమాప్తం *


0/Post a Comment/Comments