మనభాష(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

మనభాష(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

మనభాష(ఇష్టపది మాలిక)

        -డాక్టర్ అడిగొప్పుల సదయ్య


మధురంబు మనభాష మంజులము మనభాష
మంగళము మనభాష మంత్రమే మనభాష

మధుకంఠి రాగాలు వెదజల్లు మనభాష
మల్లె సౌగంధముల జల్లించు మనభాష

మంజీర నాదాల మనసుదోసెడు భాష
మందార యందాల మగత కూర్చెడుభాష

మహిలోన మంద్రమై మరులుకొను మనభాష
మమతానురాగాల మసలుకొను మనభాష

మకరందమును చిలుకు మన్మథము మనభాష
మధుపంబుయై మోగి మదిదోచు మనభాష

మంకురంబౌ నొకచొ, మంకిలంబౌ నొకచొ
మదకరంబౌ నొకచొ మదనాగమౌ నొకచొ

మరణమెరుగని భాష, మడమ తిప్పని భాష
మథనమై, నిరయమై మలుపు తిరిగిన భాష

మనసరియె మనభాష,మహిమాన్వితము భాష
మనభాష మనుగడకు మనసార వాడుదము


పేరు: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
ఊరు: జమ్మికుంట, కరీంనగర్
చరవాణి: 9963991125


0/Post a Comment/Comments