నేడు మనం
ఒకప్పుడు అమ్మ కావాలి అమ్మదగ్గరే ఉండాలి కోరుకున్నాం
కానీ నేడు అమ్మను వదలి ఖండాలు దాటుతున్నాం
ఒకప్పుడు మనకు మన హీరో మన నాన్నే నేడు నాన్న మనకు జీరో.
మనతప్పులను వెనకవేసుకునే నాన్న ఇపుడు ఏం చేసినా మనకు తప్పే
బిక్కు బిక్కుమని భయంతో ఉన్న మనల్నిఅల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలునునేడువృద్ధాశ్రమాలు లో బిక్కు బిక్కుమంటున్నారు
ఒకప్పుడు బంధువులతో సందడి చేసుకునే మనం నేడు వారొస్తే తప్పించుకొని తిరుగుతున్నాం
నాడు స్నేహితులతో అన్నీ పంచుకున్న మనం చిల్లర బుద్ధితో దూరం చేసుకుంటున్నాం
ఒకప్పుడు శుభకార్యాలకు వెళ్లి వారం రోజులు సరదా గడిపిన మనం నేడు ఒక్కరోజు కూడా ఉండలేక పోతున్నాం
నాడు తోబుట్టువులతో కలసి మెలసి ఉన్న మనం నేడు వారితో కలవాడనికి ఇబ్బంది పడుతున్నాం
స్వార్ధం నేడు పతాక స్థాయికి చేరింది.మనిషి మానవత్వాన్ని మంటగలుపుతున్నాడు
బంధాలు అనుబంధాలు రక్తబంధాల ను తెంచుకుని శాశ్వతం కానీ ఆశాశ్వతాన్నీ ఆస్వాదిస్తున్నాడు.
మంచిని ముంచుతున్నాం.కాదు కాదు మనమే మునిగిపోతున్నాం
ఎదుగుతున్న మనం ఒదిగి వుండలేకపోతున్నాం
వాస్తవాన్ని గ్రహించక ఐహికబంధాలను బతికుండగానే తెంపుకుంటున్నాడు
ఓ మనిషి ఆ తరం అద్భుతం
ఈ తరం ఒక అనంతరం
విలువలు ఇచ్చారు నాటి తరం
నైతికవిలువలు నే దిగదార్చుతున్నారు నేటి తరం
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829