పరోపకారి చెట్టు..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పరోపకారి చెట్టు..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పరోపకారి చెట్టు..!(కవిత)

చెట్టు చేసే మేలు ఇంతా అంతా కాదు..!
గాలి మాట గాదు, 
గాలిలోకి ఆక్సీజన్ వదిలి ప్రాణాలు కాపాడుతోంది..
అది అసలు మాట..!??

నీడ కాదు, పండ్లూ,ఫలాలు,కూరగాయలు,
ఆకుకూరలు ఇచ్చి కడుపు మాడకుండ 
కడుపు నింపుతోంది..!??
అది అసలైన మాట..!??

కట్టెలు కాదు, వాతావరణ కాలుష్యము నివారిస్తు,
మేఘాలను కురవనిస్తోంది..! పంటలు పండిస్తోంది,,
దాహము తీరుస్తోంది..! అన్ని జీవులకు మేలు చేస్తుంది,
అది అసలు మాట..!??

కాసింత నీళ్ళు పోసి 
సంరక్షిస్తూ..ఉంటే,తన
జీవితాంతం నిన్ను రక్షిస్తూ,నీకు రుణ పడి ఉంటుంది..!
వృక్షో రక్షతి రక్షితః ❤️ 🙏

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments