మద్యం చేసే మాయ..(వ్యాసం) --ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

మద్యం చేసే మాయ..(వ్యాసం) --ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

మద్యం ..  చేసే మాయ
         ఒక స్త్రీ ..  జీవితంలో
                            ఒక విశ్లేషణ .. 
         
  

నిజంగా ..ఒక స్త్రీ జీవితంలో ఒక పరాయి మగవాడు 'పెళ్లి' అనే మాట తో.. 'భర్త' అనే హోదాతో ఆమె జీవితంలోకి వచ్చినప్పుడు.. భర్త భరించేవాడై ఉండి. ఆమె జీవితాన్ని సంతోషాలతో నింపాలి .. కానీ నిజంగా నేడు సమాజంలో అలా జరుగుతోందా ..?
ఒక భర్త.. ఈ విషయాన్ని గ్రహించి మసలుకుంటున్నాడా ..?

భార్యా బిడ్డలను మంచిగా చూసుకోవాలని, దాని కోసం నేను ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా, మనసు చేసే మాయలకు లోను కాకుండా ఉండాలి అని అనుకుంటున్నాడా ..??

భార్యా బిడ్డలతో జీవితాన్ని బరువు బాధ్యతలతో నిభాయించాలని అనుకుంటున్నాడా.. ??
అనవర కుటుంబ కలహాలతో జీవితాల్ని నాశనం జేసే పోట్లాటలకు, గొడవలకు దూరంగా ఉండాలని మనసులో ఎప్పుడైనా నిశ్చయించుకున్నాడా.. ??

మద్యం వంటి తాత్కాలిక సుఖాన్నిచ్చే దుర్గు ణాలకు, అలవాట్లకు బానిసై
జీవితాల్ని,కుటుంబం మొత్తాన్ని బాధితుల్ని చేయడం, శాంతి - సౌఖ్యాలు దూరం చేయడం.. సమంజసమేనా, న్యాయమేనా అని ఒక్క సారన్నా ఆలోచన చేశాడా ..?? 

నేను మారాలి, నేను నా భార్యా బిడ్డలు సంతోషంగా ,ఆనందంగా జీవితాన్ని గడపాలి. అని ఎప్పుడైనా కోరుకున్నాడా ..?? రోజంతా కష్టపడి.. సంపాదించిన డబ్బును.. సారాయి వంటి దానికి ఖర్చు చేస్తూ ..కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి కావిస్తూ.. చివరకు బలవన్మరణాలకు ..దారి తీయడం దారుణం, శోచనీయం. 

ఇటీవలి కాలంలో.. కూలి నాలి చేస్తూ జీవించే జనాల్లోనే కాకుండా మధ్య తరగతి చిన్న పెద్ద ఉద్యోగస్తుల్లో కూడ. మద్యం చేసే మాయ ..కుటుంబ విఛ్చిన్నత నేటి సమస్త మానవ సమాజ శాంతికి విఘ్నంకలుగజేస్తోంది. ఎలాగో.. ఒక చిన్న ఉదాహరణ.. మన పక్కింటోడు రోజూ మద్యం తాగొచ్చి భార్యా బిడ్డలతో గొడవ పడుతుంటే మనకు ఎంత అనవసరం అనుకున్నా.. ఆ లొల్లి.. ఆ అరుపులు మన చెవులకు మనసులకు సౌఖ్యo కలిగిస్తాయా.. అశాంతిని కలిగించదు.. ? ఒక్క తాగుబోతు వల్ల వీధి వీధంతా.. కాలనీ అంతా శాంతి సౌఖ్యాలను కోల్పోవాలా.. ?? ఇదేం ఖర్మ.. ? ఇదెక్కడి గోల.. ?

ఎవనిదో.. నెత్తి, ఎవని దో.. కత్తి.. అంటే ఇదేనేమో ..??
మద్యంతో.. కుటుంబాలన్నీ మాయమవుతున్నా.. ప్రజల్లో.. మార్పు రావడం లేదు.

మార్పు.. కష్టమేం కాదు

ముందు ఆలోచనల్లో.. మార్పు రావాలి.. కుటుంబం గురించి..ముందు సదాలోచన.. చేయాలి.
మెల్లి మెల్లిగా ..మద్యం అలవాటు వదలుకోవాలి .
ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి.
మద్యం మాయ.. నుంచి బయట పడే ఉపాయం గురించి ఆలోచన.. కృషి చేయాలి.
అప్పుడు గాని, మార్పు రాదు..!??

✒️విన్నర్
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments