వాల్మీకి మహర్షి ---వర్త్యా వెంకటేష్

వాల్మీకి మహర్షి ---వర్త్యా వెంకటేష్ 'మహా ఋషి వాల్మీకి '
******************

సంపూర్ణ శ్రీ మద్ రామాయణం ,
వాల్మీకి  మహర్షి విరచితం.
జగత్తుకు సుపరిచితం, 
ఆదర్శ శ్రీ రామ
సుందర కావ్యం.

బోయవానిగా'వాల్మీకి'జననం
'మర ,మర' అనినామస్మ రణం
' వల్మిడి'లోఘోరతపస్సుఆచరణం  
మహాకావ్యకర్తగాసృష్టించె'అద్భుతం'

సంస్కృతంలో రామ కథా రచనం
'కాండ'లుగాఅల్లినమధురరామలీలామృతం
'రఘువంశ తిలకుని'  సౌశీల్య ఆదర్శం
'సీతామాత 'సజీవ సహన సౌజన్యం

'దశరథుడి'అనన్యశ్రీరామవాత్సల్యం.
మత్సరాన 'కైకేయి' కోరికల క్రూరత్వం
సీతా లక్ష్మణ సమేత శ్రీ రామవనవాసం
'ఆంజనేయ, సుగ్రీవు లతోమైత్రీ బంధం.


తాటక, మారీచు,సుబాహు రావణసంహారం
వానరసేన కట్టె అపూర్వ' సేతుబంధం'
ఉగ్ర హనుమంతుని లంకాపురి దహనం
అయోధ్యానగరాన శ్రీరామ పట్టాభిషేకం


'శూన్యం నుండి అనంతం'గా వాల్మీకి ప్రాభవం.
అందుకో మహర్షీ.. సహస్రకోటివందనం.

********************************
వర్త్యా వెంకటేష్.    
వికారాబాద్  

0/Post a Comment/Comments