బడుగుల చేరవే వరలక్ష్మీ!(ఇష్టపది మాలిక) --డాక్టర్ అడిగొప్పుల సదయ్య

బడుగుల చేరవే వరలక్ష్మీ!(ఇష్టపది మాలిక) --డాక్టర్ అడిగొప్పుల సదయ్య

బడుగుల చేరవే వరలక్ష్మీ!(ఇష్టపది మాలిక)

ఏడుకొండలవాని ఎదలోన కొలువుండి
ఎల్లలోకములనల చల్లగా చూడవే

తండ్రి దండన నుండి తప్పించి మముగాచి
పురుషకారముచేసి వరములిప్పించవే

జగమంత నీకొరకు జపములను,తపములను
కొలిచి తమ కోర్కెలతొ నిలిచి ఉన్నారమ్మ!

కడలిపై వానల్లె కలవారి భవనముల
స్థిరమయ్యి పేదిండ్ల చేరవెందుకు తల్లి?

బిర్లాల,టాటాల బిలములో నెలవుగొని
బడుగు కడుపుల నింప అడుగేయి మాతల్లి!

ఆదాని,అంబాని ఆవాసముల వదలి
పూరి గుడిసెల జొచ్చి పులకింపజేయవే!

మదన జననీ! నీవు కదలాడు ఇల్లేమో
సిరి సంపదల తూగి చిరునగవులొలికేను

ఇందిరా! నువు లేని ఇల్లు "నిల్లే"గాని
"ఫుల్లుగా" కష్టాల నీళ్ళగుండము తల్లి!

కనకలక్ష్మీ! నిన్ను కలవాడు "కలవాడు"
బలములన్నిటవాడు పరపతులు కలవాడు

పొదుపు చేయనివారి పొలిమేర పోబోకు
పిసినారి పేటికన వసియించకే తల్లి!


డాక్టర్ అడిగొప్పుల సదయ్య
ఇష్టపది రూపకర్త
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125


0/Post a Comment/Comments