" తెలుగుభాషాదినోత్సవం "-గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

" తెలుగుభాషాదినోత్సవం "-గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

" తెలుగుభాషాదినోత్సవం "
---------------------------------------

గిడుగురామ్మూర్తి ఇల జన్మదినము
వ్యావహారిక భాషకు శుభదినము
తెలుగోళ్లకు భువిలో పర్వదినము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

గురజాడ, గిడుగు అందరి త్యాగము
తెలుగువారు చేసిన పుణ్యఫలము
వాస్తవమే! పూర్వజన్మ సుకృతము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఎన్నో ఉద్యమాలు చేసినారు
త్యాగాలతో అసువు పోసినారు
రచనలతో అందము తెచ్చినారు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

వ్యావహారిక భాష అతిమధురము
ధరలో పరిమళించు పూలవనము
పసిపాప చిరునవ్వులా అందము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మాతృభాష పరిరక్షణ బాధ్యత
అభివృద్ధి చేయాలోయ్  అంచేత
వీడాలి అందరు ఉదాసీనత
చూడచక్కని తెలుగు సున్నితంబు!

-గద్వాల సోమన్న

1/Post a Comment/Comments

  1. సోమన్న గారికి నమస్సులు..👏🏽
    మీ సున్నితం ఆద్యంతం చక్కగా ఉన్నాయి సార్..🙏🏽👍🏾.

    ReplyDelete

Post a Comment