విజయం నీదే - మార్గం కృష్ణ మూర్తి

విజయం నీదే - మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: విజయం నీదే

నిశి ఆవరిస్తే 
నీవు ఏమీ వీక్షించ లేవు!

విద్త లేని వాడు
వేదాలను చదువ లేడు!

అజ్ఞానుడు 
విజ్ఞానుడు కాలేడు!

బండ మీద 
విత్తనాలు పోస్తే మొలకెత్తవు!

నాస్తికుడు
దేవుడిని నమ్మ లేడు!

ఆన్లైన్ కు
అలవాటు పడిన వారు
ఏమి వచ్చినా వండుకుని తింటారు!

ఇక జ్ఞానోదయం కలిగే దెపుడు?
ముందుకు పయణం సాగేదెపుడు?

మూఢ నమ్మకాలు
కలిగిన వారు  ఎదుటి వారు 
జలుబు చేసి తుమ్మినా , అపశకనమని
ఆ రోజు ప్రయానం ఆపేస్తారు!

ఇక ప్రయానం ముందుకు ఎలా సాగుతుంది?

వ్యాపారంలో
నిర్ణయాలు సరీగా లేనపుడు
లాభాలు ఎలా వస్తాయి?
ముందుకు ఎలా సాగి పోగలడు?

ఆకాశమంతా  
మంచు ఆవరించినపుడు
రవి కిరణాలు పుడమిని ఎలా తాకగలవు?
వెలుతురు నెలా ప్రసరింప చేయగలవు?

చీకటిలో చిరు దీపం వెలిగించాలి
నిరక్షరాస్యతను తరిమి కొట్టాలి
అజ్ఞానాన్ని పారదోలాలి
భయాన్ని వదిలి పెట్టాలి
దైవాన్ని నమ్మాలి
మూఢనమ్మకాలను వదిలేయాలి
సమరసత భావాన్ని పెంపొందించు కోవాలి
సమస్యలను విశ్లేషించాలి
కోరికలను ,అత్యాశను తగ్గించు కోవాలి
అరిషడ్వర్గాలను నియంత్రించాలి
అభివృద్ధిని కాంక్షించాలి
సానుకూల భావనలను పెంపొందించు కోవాలి

అపుడు సాగని పయనమంటూ ఉండదు
విజయం నీదే!

మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments