కథానిక: పెళ్ళి సంబరం --సత్య మొండ్రే టి

కథానిక: పెళ్ళి సంబరం --సత్య మొండ్రే టి


భారతీయ వివాహ వ్యవస్థ

పెళ్ళి సంబరం

కథానిక:"ఆద్యా నిన్ను చూడటానికి పెళ్ళివా రు వస్తున్నారు.ఎక్కడకు వెళ్లకు " అన్నారు శర్మ గారు
"నాకు పెళ్ళిచూపులు నచ్చవు నాన్న.. ఇరు వైపుల వాళ్ళు మాట్లాడుకుని సింపుల్ గా దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోతుంది నాన్నా" అన్నది ఆద్య. అలా అనకు తల్లీ... భారతీయ వివాహ వ్యవస్థ చాలా పటిష్ట మైనదిప్రపంచ దేశాలకు ఆదర్శం . పెళ్ళి అనగా ఇ ద్దరు భాగస్వాముల మధ్య హక్కులు బాధ్యత లు స్థాపించే ఒక చట్ట బద్దమైన సంఘ సమ్మతమైన ఒప్పందం.

హిందూధర్మ శాస్త్రం ప్రకారం వివాహాలు నాలుగు రకాలు.
  1. బ్రహ్మీ వివాహం: ఋషి సంప్రదాయ వివాహం వధూవరుల ఇరు వరి పెద్దలు మాట్లాడుకుని నిర్ణయించేది.
  2. గాంధర్వ వివాహం: ఇద్దరూ ఇష్టపడి పెద్దల ప్రమేయం లేకుండా చేసుకునే రహస్య వివాహం
  3. క్షత్రియ వివాహం:కన్యకు ఇష్టం లేకున్నా బల పరాక్రమ లు ఉపయోగించి కన్యను ఎత్తు కు వెళ్ళి పెద్దల సమక్ష లో చేసుకునేది.
  4. రాక్షస వివాహం:నీచమైన పద్దతి.బలవంతం గా కన్యను తీసుకెళ్లే పెళ్లి చేసుకునేది.
ఇవి మన పూర్వీకులు నిర్ణయించిన వివాహాలు.

మన సంప్రదాయ వివాహం లో ముందుగా వధూవరుల పెళ్లి చూపులు చూశాక వారి ఇష్టం తో పెద్దలు మాట్లాడుకుని వివాహం నిశ్చయం జరుగుతుంది. ఇరు వర్గాల వాళ్ళు లగ్న పత్రిక మార్చుకుని వివాహ కార్యం మొదలెడతారు ముందుగా విగ్నేశ్వరుని కి పూజ చేసి బియ్యం కడతారు. లగ్నానికి ముందు రోజు పెళ్లి కూతురు గా వరుడు వధువుని ముస్తాబు చేస్తారు పేరంటాలు ముత్తయిదువులు పెళ్ళి తంతు చూస్తారు. వద్దు వద్దు గౌరీపూజచే స్తున్ పెళ్లి మండపం లో. వధువు తల్లిదండ్రులు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. వరుడు వధువు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెడతారు అదే నిజ లగ్నం. తర్వాత వధువు మెడలో వరుడు మంగళ సూత్రం కడతాడు. వధువు వరుడు తలంబ్రాలు పోసుకునే తర్వాత బిందెలో ఉంగరాలు తీస్తారు. తర్వాత సప్తపది జరుగుతుంది వధూవరులు హోమం చుట్టూ ఏడడుగులు వేస్తారు. పురోహితుడు వేదమంత్రాలతో వివాహం కార్యక్రమం జరుపుతాడుఏడడుగుల లో మొదటి అడుగు ఇద్దరిని ఒకటి చేయుగాక రెండు విష్ణు ఇద్దరికీ శక్తి లభించినట్టు చేయుగాక మూడు వివాహ వ్రతం సిద్ధించు గాక నాలుగు ఆనందం కలిగించు గాక ఐదు ఆరు ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక గృహస్థాశ్రమ ధర్మం నిర్వహణకు విష్ణు అనుగ్రహించుగాక ఏడడుగుల అర్థం ఇది. ఎంతో సుందరమైన వివాహ వ్యవస్థ మనది వేద మంత్రాలతో వధూవరులు ఒకరికి ఒకరు గా మంత్ర ప్రభావం వలన వారి జీవితం ఆనందనిలయ మౌతుంది కష్టసుఖాల్లో కలిమిలేములు ఒకరికి ఒకరు తోడు నీడ దీవెన యాత్రను కొనసాగిస్తారు. అద్భుతమైన ఆనందమైన వివాహ వ్యవస్థ మనది తల్లి అని వివరించారు శర్మగారు

ఆద్య ఆనందంగా మీ ఇష్టప్రకారమే వివాహం జరిపించండి నాన్న అన్నది.

పేరు;శ్రీమతి సత్య మొండేటి
ఊరు:హైదరాబాద్
చరవాణి:9490239581

0/Post a Comment/Comments