- కృష్ణ మూర్తి
స్వర్గమయం
కంటిలో నలుసు
చెవిలో జోరీగ
చెప్పులో రాయి
ఎదురింట్లో గిట్టని వారు
పక్కింట్లో ఈర్ష్యపడే వారు
ఉంటే ఇక జీవితం నరకమే!
దేశంలో, రాష్ట్రంలో
ప్రతి పక్షం లేకుంటే
పాలకులు పన్నులు వేస్తూపోతూ
భూ కబ్జాలు చేస్తూ, దర్జాగా బ్రతుకుతూ
ప్రజల పన్నులను, బంధు పథకాలకు
ఓటు బ్యాంకులకు ఖర్చు పెడుతే
ఇక సామాన్యుల జీవితాలు నరకమే!
పెట్రోల్ డిజిల్ ధరలు పెంచుతూ పోతే
గ్యాస్ ధరలు పెంచుతూ పోతే
అన్నధాతలకు గిట్టు బాటు ధరలే లేకుంటే
బడుగుజీవుల బ్రతుకులు అగమ్యగోచరమే!
ప్రజలు ముందుగానే మేల్కొని
అవినీతిపరుల ఆవలబెట్టి
భూకబ్జాదారుల నిలువరించి
క్రిమినల్స్ ను తరిమి కొట్టి
సమర్ధులను ఎన్నుకుంటే
జనుల జీవితాలు స్వర్గమయమే
ప్రతి ఇంటా ఆనంద దీపాలే!
మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్
9441841314
Post a Comment