" చిన్న పిల్లలు "--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

" చిన్న పిల్లలు "--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

" చిన్న పిల్లలు "
-------------------------------------

చిన్న పిల్లలు వెలుగు దివ్వెలు
కన్నవారికి కంటి పాపలు
సన్నజాజుల తావి జల్లులు
వెన్న వంటివి వారి మనసులు

ఇంటి కొలనున కలువ పూవులు
చంటి పిల్లలు మింటి తారలు
తల్లిదండ్రుల కలల పంటలు
గృహం గుడిలో గొప్ప వేల్పులు

కాంతినొసగే  ఉదయభానులు
శాంతికాములు , కరుణ హృదయులు
మేలు చేసే ప్రేమ జీవులు
భువిని వెలసిన గొప్ప వ్యక్తులు

పగలు ఎరుగని పుణ్యమూర్తులు
మాట తప్పని త్యాగ పురుషులు
ప్రేమ చూపిన వారు మిత్రులు
భరతమాతకు ప్రీతి పాత్రులు

--గద్వాల సోమన్న ,
          ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments