సరైన లక్ష్యమే జీవితానికి ఉన్నతి ---వి. కృష్ణవేణి

సరైన లక్ష్యమే జీవితానికి ఉన్నతి ---వి. కృష్ణవేణి



సరైన లక్ష్యమే జీవితానికి ఉన్నతి

ఉన్న స్థితి నుండే ఉన్నత స్థితికి ఎదిగుతేనే
ఉంటుంది అందులోని ఆనందం..
ఎవరైనా తన స్థాయి ఏమిటో తెలుసుకుని అంచెలంచెలుగా ఎదగగలగాలి.
ఒక్కసారిగా ఆకాశానికి నిచ్చెన వేయకుండా..
ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గుణపాఠంగా.. మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి.
జీవితమనే నావను ఒడ్డుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలిగాని..
అంతా నాదే అంటూ ప్రతీది నాకే కావాలంటూ
హద్దులు మీరిన కోర్కెలతో..
తాను మోయలేని భారాన్ని నెత్తిన పెట్టుకుని...
సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతూ...
ఉన్న స్థానంలో విలువను కోల్పోతూ..
జీవితాన్ని, కాలాన్ని వృధా చేసుకోకుండా..
అందనిదాని కోసం అందల మెక్కకుండా..
తన స్థానం నుండే సరైన మార్గాన్ని ఎంచుకుని..
క్రమశిక్షణ అలవర్చుకుని, సమయానికి విలువనిస్తూ...
ఎదుటివారి కష్టాన్ని ఆశించక...
ఎదుటివారితో పోల్చుకోకుండా..
తాను సాధించవలసిన లక్ష్యానికి  మాత్రమే కృషిచేస్తూ..
జీవితానికి కాలానికి ఉన్న అవినవ సంబంధాన్ని
తెలుసుకుంటూ..
కాలానికి అతీతంగా మునుముందుకు సాగిపోతూ...
ఉన్నతిని పొందితేనే జీవితం సఫల మార్గంలో నడుస్తుంది..
అప్పుడే జీవితానికి సార్దాకత లభిస్తుంది.

వి. కృష్ణవేణి.
వాడపాలెం.

ప్రక్రియ :వచనం 


 

0/Post a Comment/Comments