శీర్షిక, పుస్తకమే ప్రపంచం. శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక, పుస్తకమే ప్రపంచం. శ్రీమతి సత్య మొం డ్రేటిశీర్షిక: పుస్తకమే ప్రపంచం

తెరసిన పుస్తకమా
నీవే నా హృదయ స్పందన
చూపించావు ప్రపంచాన్ని నాకు
వినిపించావు ఎందరో మహానుభావుల భావ స్వరాలు
తెలుసుకున్నాను మహాకవుల వ్యక్తిత్వాలు
అనుసరించాను వారి మార్గ  దర్శకం
 తెరిసిన పుస్తకంలో ప్రతి పేజీ విజ్ఞానపు గని
నాలోని తిమిరాన్ని పారద్రోలి కిరణాన్ని ప్రకాశింప చేసిన పుస్తకమా
మీకు నా శతకోటి ప్రణామములు
తెరిచిన పుస్తకం లానే  నా హృదయం తెరిచి కవితలు అల్లాను  నీమీద.... పుస్తకములోని అక్షరాలు నా జీవి జీవితానికి సువర్ణ అక్షరాల శ్లోకాలు.......
పుస్తకమే నా ప్రియమిత్రుడు
పుస్తకమే నా ప్రియుడు
పుస్తకమే నా గురువు దైవం....
సరస్వతి అమ్మ ఒడిలో పుస్తకమై పుట్టాలని నా చిరకాల వాంఛ... అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే......
పుస్తకంలోని ప్రతి పేజీ చరిత్రకు ఆధారం భవిత బంగారం సదా మంచి చరితలు అందిస్తూ...
భావితరాలకు మంచి మార్గం బోధిస్తూ కలకాలం విజ్ఞాన వెన్నెల చేయాలని ఆశతో ఆకాంక్షతో పుస్తకమా వర్ధిల్లు....

పేరు: శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
ప్రక్రియ: వచనం
చరవాణి :9 4 9 0 2 3 9 5 8 1
హామీ పత్రం :కవిత నా సొంతం దేనికి అంతేనా అనువాదం కాదు కాఫీ చేయబడలేదు అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments