గుర్రాల ముత్యాల హారాలు.
తేది 20-8-21 ముత్యాల హారాలు.
681) నిప్పుపై నీళ్ళు చల్లు
వేయకు ఉప్పుగల్లు
విన్నావా వీరమల్లు
గోకరికాయ గిల్లు !
682) పులి మీద పుట్ర ఉంది
బోనులో బందీ అయింది
అటు ఇటు తిరుగుతుంది
పంజాతో కొడుతుంది !
683) రాములోడి గుడి దగ్గర
అరవకు నీవు బిగ్గర
కాసేపైనా తగ్గర
ఓడి నీవు నీ నెగ్గర !
684) ముగ్గు ఉంది నీ ముందు
పసందుగా వేయి ఇందు
నీళ్లు చళ్లకు అందు
తెలుసుకొని రా గోందు!
685) మెలమెల్లగ నడవరా
వేలు నీవు విడువరా
దగ్గరుంది గడువురా
త్వరత్వరగా పదరా !
686) అదిగో పత్తి చెట్టు
దానిపై కత్తి పెట్టు
చుట్టూ కట్టు నెట్టు
దాటిరా ఇక గెట్టు !
687) పట్టొద్దుర నీవు కుస్తి
వారు చేస్తారు శాస్తి
అప్పడౌతుంది సుస్తి
వదులుకో నీ మస్తి !
688) చంద్రునికి నూలుపోగు
వేయకురా నువు ఆగు
వస్తున్నాడు పొరం పోగు
వేస్తాడు దారం పోగు !
689) పూల చీర కట్టుకుంది
బొట్టు బిల్లా పెట్టుకుంది
తాను గడప తట్టుకుంది
నేలపై కూలబడింది !
690) గ్లాస్ మీద గ్లాసుంది
పగలకుండ చూడమంది
చేయవద్దు లొల్లి అంది
తానే చేస్తూ ఉంది !
691) మిరపకాయలు కారం
తీసేయ్ వాని సారం
జర జరుగుతావ దూరం
చేయరా సహకారం !
692) ఎంత ముద్దుగా ఉన్నది
సిగ్గు లేదా అన్నది
మొగ్గై నవ్వుతున్నది
రగ్గు కప్పుకున్నది !
693) జర ఆలోచించు తమ్మి
నీ గురించి అంది అమ్మి
ఆడొద్దురా ఆ రెమ్మి
తెలిసిందిగా సుమ్మి !
694) అందరినీ ఆదరించు
నీవు ప్రేమను పంచు
మంచికి తలవంచు
అంతా నిన్నే దీవించు !
695) తప్పులు వెతకకు నీవు
నీ తప్పులు తెలుసుకోవు
వచ్చేను గంగిగోవు
దానికి చేయి తావు !
696) ప్రేమ కలిపి చూడురా
తెలుస్తుంది నీ దారిరా
నీ నీడ నీ తోడురా
నీ వెంటే ఉందిరా !
697) ఇది మానవ లోకం
మరి ఉంటుంది శోకం
చదువలేవా శ్లోకం
చదవరా శశాంకం !
698) దండోరా వేసి రా
దండలను తీసుకురా
తేదీ పోతుందిరా
గంట మోగుతుందిరా !
699 గుడిలో ఉంది లింగం
పైన ఉంది బాసింగం
వద్దు అధిక ప్రసంగం
చయ్యకురా భంగం !
700) ఏడువందలు పూర్తి
అయ్యాయి సంపూర్తి
ఏమొచ్చింది కీర్తి
పోదాం పద పుట్టపర్తి !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.
Post a Comment