ఈ పిచ్చిముదరక ముందే...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఈ పిచ్చిముదరక ముందే...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఈ పిచ్చిముదరక ముందే...

 
ఫేస్ బుక్
వాట్సాప్ ల పిచ్చిపట్టి 
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి 
ముఖ్యమైన
పనులన్నీ మూలకునెట్టి 

సత్సందేశాలివ్వాలనే సంకల్పంతో
అర్ధరాత్రి దాక కంటిమీద కునుకు లేక 
తిండి తిప్పలు మాని పూర్తిగా
శ్రీమతితో ఇంట్లో "తిట్లు చీవాట్లు తింటూ" 
తెల్లవార్లూ మెసేజ్ లు టైపుచేసుకుంటూ
ప్రొద్దుటే శుభోదయమంటూ...పెట్టేవ్ పోస్టు

ఆపై ఒక చకోరపక్షిలా 
కామెంట్ల కోసం, లైకుల కోసం 
కళ్ళు రెండు కాయలు కాసేలా
ఎదురు చూస్తావ్ ఆశతో..ఎంత టైమ్ వేస్టు  

మిత్రులారా! ఇకనైనా ఈ పిచ్చి మానుకోండి!
మీ సెల్లుకు మీరు బానిసలుగా మారిపోకండి!

మూటికి ముమ్మాటికిది మూర్ఖత్వమే !
వెయ్యి మాటలేల ఇది వెఱ్ఱితనమే !
అవివేకమే అజ్ఞానమే ! నిజానికి 
ఇదంతా నాటకమే ! ఫేకుల బూటకమే ! తగిలేది
ఎదురు దెబ్బలే !  చివరికి మిగిలేది పెడబొబ్బలే !
 
ఇది పరుల మెప్పుకోసం తెలిసిచేసే పెద్దతప్పు !
ఇది నివురుగప్పిన నిప్పు !
ఇది రేపు సునామీలా ముంచుకొచ్చే పెనుముప్పు!

అందుకే కాలమెంతో విలువైనదని
వృధా చేసుకున్న బ్రతుకు విషతుల్యమేనని
సద్వినియోగ చేసుకున్న జీవితం స్వర్గధామమేనని
పలికిన మన యోగి వేమన్న వేదాంతం 
గుర్తుంచుకోండి మిత్రులారా జీవితాంతం 
నేటి "శుభోదయం" కలిగించు గాక! మీకు "జ్ఞానోదయం"

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 

0/Post a Comment/Comments