చీకటిని తిట్టడం కంటే ఒక క్రొవ్వత్తిని వెలిగించాలంటారు...
తరిగిపోయే శిలాజఇంధనం తరగకుండా మనసు ఎపుడైనా మారుతుందా? మారదు
మర్చాల్సింది మార్పునుకోరుకోవల్సింది మనిషి మనసు మాత్రమే సుమా..
కాసింత దూరానికే కిక్కు కొట్టడం ఆపి కొమ్మమీద పిట్ట నడిచినట్లు
రెమ్మపై పురుగు సాగినట్లు
కూలసాగా కూసంత నడుద్దాం..
సౌకర్యానికి అత్యవసరానికే కార్లూ ,గేర్లూ వాడుదాం....రయ్ మని వెళ్దాం
పల్లె ,పట్టణాలను వాహనాలు ఏలుతున్నాయి ఏకఛత్రాధిపత్యంగా...
పొగరాక్షసి జడలువిరబోసుకుని చంపుతుంది స్వచ్ఛమైన గాలిని నింగిలోపలా నిత్యం..కనిపించకుండా
మహానగరాలు గాలి కాలుష్యానికి విలవిలలాడుతున్నాయి
నగరవాసులెందరో వాయుసంబంధవ్యాధులతో అల్లాడుతున్నారు..ఆరిపోతున్నారు...
ఎంతపాపం ఎవరి శాపం ఇది?
రాబోయేతరానికి కానుకంటారా ?
మనంవాడే వాహనాల కర్బన పొగవాయువుల ఈ కాలుష్యం?
ఇప్పటికే అయింది దండి ఆలస్యం
ఏ జంతుజాలం తన సహజనడకను, నడతను భూమ్మీద మార్చుకోలేదు
నరుడుమాత్రమే అభివృద్ధని అందలమనీ
విచ్చలవిడిగావాహనాలను నడపడం ఆపడంలేదు
వేగంవేగమంటూ ఆగమవుతుండు
అందుకే
నడుద్దాం మనిషిగా...కాళ్లతో
కాకుంటే సైకిళ్లతో....
ఒక్కో ఇంధనపుబొట్టు
అత్యవసరాలకు అభివృద్దికి రక్తపుబొట్టుతో సమానం
ఇది అవమానం
మానవజాతికి,మేధకి ఘోరఅవమానం
మనకు కావల్సింది ఆరోగ్యమందించే నడకదార్లు...
సైకిల్ లైన్లు..,.సైకిల్ కారిడార్లు
నడకను,సైకిల్ నమ్మినవాడికి దరికిరాదు
పెట్రోల్ పోటు
మరిలేదు ప్రభుత్వాల పై మండిపాటు
మనసులో ఎప్పుడూ తావులేదు ఏ అలజడికి
వాళ్ల కాళ్లూ,వాళ్ల సైకిళ్లు
ఒకరకంగా పొదుపు సూత్రం దేశ ఉత్పాదనకు
రండి...కదలండి...
కల్సినడుద్దాం... హాయిగా
సైకిళ్లే ఆరోగ్యం మైలురాయిగా
నల్లగొండ రమేశ్
ఆసీఫాబాద్
కుమ్రంభీంజిల్లా.