జానపద కథలు విశిష్టత (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

జానపద కథలు విశిష్టత (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

జానపద కథలు విశిష్టత

జనపదాలు తెలుగువాళ్లకు వరాలు
కళా వైభవానికి ముత్యాల సరాలు
ఉర్రూతలుగించే పాటలకి పొంగుతాయి మన నరాలు
గ్రామ జీవన వినోదానికి అసలుసిసలైన జనపదాలు

తప్పేటగుళ్లు భూమిభాగోతం తొలుబొమ్మలాటలు
పులివేశాలు సరదా సరదా కోలాటాలు
సాధారణ జనాల సాధారణ ప్రతిభ పాటవాలు
తెలంగాణ జనజాగృతి కళావైభవాలు

సాహిత్య రంగంలో విలువకట్టలేని అమూల్య సంపద
బుర్రకథ గజ్జెకట్టే పాటలు ఆనంద సంపదలు
బతుకమ్మ బోనాలు పండుగల వినూత్న గాన సంపద
ఇవన్నీ జానపదుల సంస్కృతికి
కళా సంపదలు

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక
తెలుగు నిండుతనానికి గౌరవ వేడుక
సర్వజనీనానికి ఆనంద ఆహ్లాదాల వేదిక
ప్రపంచానికి జానపదం ఒక అద్భుత కానుక

వంగపండుగారి పాటలతో కూలన్న రైతన్నల గళాలు
పచ్చని పైరులలో నిండైన దిగుబడులు
జానపదాల  కల కల సిరిపంటలు
ఇదే ఇదే జానపదం తెలుగువాకిట ఆనందపదం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         సాలూర్
          విజయనగరం జిల్లా
          9441530829


0/Post a Comment/Comments