శ్రీకృష్ణుడి లీలలు

శ్రీకృష్ణుడి లీలలు

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: శ్రీకృష్ణుడి లీలలు

ఆబాల గోపాలుడు
చిలిపితనంబు బాలుడు
లోకకళ్యానమునకై
అవతరించిన పురుషుడు

మేనమామైన కంసుడు
పరమ నీచుడు రాక్షసుడు
అల్లుడు గండమనితలిచి
దేవకిని బంధించాడు

దేవకి వసుదేవ సుతుడు
అష్టమీ తిథిన కృష్ణుడు
కఠిన కారాగారమున
జన్మించె శ్రీకృష్ణుడు

పెంచెను యశోదనందుడు
పెరిగె ముద్దుగా కృష్ణుడు
గోపికలనేడిపిస్తూ
చీరెలెత్తుకెల్లె వాడు

అన్న బలరాముడితో
తనమిత్రబృంధముతో
వెన్నదొంగిలించెతినే
దేవకమ్మ రాకతో

పూతకిని హతం చేసి
కంసుని ఖండించేసి
దేవతల రక్షిస్తివి
శిశుపాలుని చంపేసి

ఎన్నెన్నో  నీలీలల
పొగడేదెలాగోపాల
వందే ఓ జగద్గురూ!
ఈ సృష్టంత నీలీల

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
9441841314

0/Post a Comment/Comments