శీర్షిక:శ్రావణ సిరి శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక:శ్రావణ సిరి శ్రీమతి సత్య మొం డ్రేటి


శీర్షిక: శ్రావణ సిరి

సిరిలు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి
శ్రావణమాసపు శుభ సమయా
న స్వాగతం నీకు సుస్వాగతం...
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి గా వేంచేసి
న నీకు‌  వ్రత నీరాజనాలు అర్పిస్తూ‌‌ ఆరాధిస్తాం..
తొలుత చారుమతి ఈ వ్రతమాచరించి సకల సౌభాగ్యాలను పొందినది... తరతరాల వరలక్ష్మీ వ్రతం మగువల పాలిట కల్పవృక్షం స్త్రీలు నిష్ఠా గరిష్టులై భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ దేవిని పూజిస్తారు.....
దేవి కరుణాకటాక్షాలను పొందుతారు
ధనధాన్యాలు కు మూలం లక్ష్మి 
ఆమె సాక్షాత్కారం అందరికీ అవసరం...
తెలుగు లోగిళ్ళలో వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు...
బ్రాహ్మణ ఆశీర్వాదం పొందుతారు
ముత్తయిదువులకు పసుపు కుంకుమ పువ్వులు తాంబూలాలు పంచుతారు
ఏ పండగ పరమార్థమైన ప్రజాహితం.. ప్రజలంతా  ఐకమత్యంతో ఆనందంగా గడపాలన్న ఉద్దేశం...
పసుపు కుంకుమలతో పిల్లాపాపలతో ధనధాన్య సిరులతో విలసిల్లాలని కోరుకునే మగువల మానసిక సంకల్పమే వరలక్ష్మీ వ్రతం.
దేశం సుభిక్షంగా పసిడిపంటల తో వెలగాలని, ఏ మహమ్మారి వ్యాధులు బారిన పడకుండా ప్రజలను కాపాడాలని వరలక్ష్మీ దేవిని ప్రార్థిస్తున్నాము...
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి మీ దీవెనలు మాకు ఒసగుము తల్లి...
సర్వేజనా సుఖినోభవంతు.. శ్రీ మాత్రే నమః

పేరు; శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
ప్రక్రియ: వచనం
చరవాణి: 9 4 9 0 2 3 9 5 8 1

0/Post a Comment/Comments