మృగాలు.. హీనాతి హీనులు..! ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మృగాలు.. హీనాతి హీనులు..! ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మృగాలు.. హీనాతి హీనులు..!(కవిత)

మానవత్వం మరిచి,
మనిషి మృగమై జీవనం వెళ్లదీస్తున్నాడు..!
ఆడ మనిషికి బయటికి వెళ్లాలంటేనే జంకు 
పుడుతోంది..!
కాలి నడకన వెళ్లిన 
పిచ్చి కుక్కలుగా చూసే చూపులు..!
ఆటో వెళితే కాలయముడైనట్లు, 
తోడేలు అయిన ఆటో డ్రైవర్..!
బైకు మీద వెళితే..
కాకుల్లా పొడిచే కీచకులు..!
ఎలా వెళ్ళాలో అర్ధం కాని అయోమయంలో స్త్రీ జీవితం..!???
రక్షణ కరువై,
వెళ్లదీస్తున్న జీవిత దైన్యం..!??
అర్ధరాత్రి కాదు కదా ,
పట్టపగలే రాబందు 
ల్లాంటి..
మానవ రూపమృగాలు 
దారి కాచుకొని ఉంటున్నాయి..!
కామ పిశాచులై..
విశృంఖల హీనాతి హీన జంతువులై..
మతి చలించి ప్రవర్తించే రేపిస్టులకు బహిరంగ ఉరే సరైన శిక్ష..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments