" పసి పిల్లలు " -గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు.

" పసి పిల్లలు " -గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు.

"  పసి పిల్లలు  "
---------------

పాపము ఎరుగని పిల్లలు
లోకంలో ఇలవేల్పులు
మనసులు విచ్చిన కలువలు
ఉండును నైతిక విలువలు

కపటం ఎరుగని బాలలు
కొలనున ఉండే హంసలు
పెట్టకు వారిని హింసలు
ప్రేమలు చిందే  జీవులు

మమతలు ఒలికే మనసులు
నింగిని జాబిలి సొగసులు
వెలుగులు పంచే భానులు
దైవము మెచ్చే బాలలు

ఉండవు వారికి కక్షలు
పెట్టరు ఎన్నడు ఆంక్షలు
స్వేచ్చగ ఎగిరే ఖగములు
వారు ఉన్నచో జగములు

శుద్ధము పిల్లల బుద్ధులు
ఇష్టము వారికి పెద్దలు
శ్రేష్ఠము తలలో తలపులు
సత్యము పలికే పలుకులు


-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
        ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments