డాబుసరి - మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్

డాబుసరి - మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్


- మార్గం కృషమూర్తి

డాబుసరి

ఉన్నోడి దగ్గర
లేనోడు లోకువ!

నోరు
ఉన్నోడిదే ఊరు!

మాటకారులదే
గెలుపు!

రాజుది
ఆడిందే ఆట
పాడిందే పాట
డాబుసరి "ముస్తాబులకు పల్లకే" మి ఖర్మ
ఫలక్నామా ప్యాలేస్ కూడా అడుగు దూరాన్నే!

డూడూ బసవన్నా అంటే
తల ఊపే ప్రజలు ఉన్నంత కాలం

ఓటుకు నోటు యిస్తానంటే
ఓటు వేసేవారున్నంత కాలం

ఉచితం అనగానే
ఉప్పొంగి పోయే వారున్నంత కాలం

తుపాకి రాముడిలా
ఏ ఎండకా గొడుగు పట్టేవారున్నంత కాలం

నీటిమీద రాతల్లాంటి హామీలిస్తే
కాళ్ళచుట్టూ తిరిగే ఓటర్లున్నంత కాలం

పిట్ట కథలు చెబుతుంటే
చెవులు నిక్కపొడిచి వినేవారున్నంత కాలం

ప్రజా ధనాన్ని తోడేళ్ళలా దోచుకుంటుంటే
చూస్తూ కూర్చునే మేధావులున్నంత  కాలం

అవినీతి పరులు "ముస్తాబుల పల్లకీ" ల్లో
ఊరేగడం తప్పా ,పల్లకీలు మోస్తారా?
మోయను గాక మోయరు

ప్రజా దోపిడి దారులు''ముస్తాబుల పల్లకీ"లే, నవాబులే!

- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్








0/Post a Comment/Comments