"ఛాయేవానుగతాసదా" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"ఛాయేవానుగతాసదా" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

ఛాయేవానుగతాసదా

సమాజంలో ప్రతి మనిషికి
తోడు నీడ ఎంతో అవసరం
సాటి వారికి తోడుగాను
కట్టుకున్న వారికి నీడగాను
నిలవాలనేదానికి నిదర్శనం రామాయణం
సీతారామ కల్యాణం జరిగె
జనక మహారాజు సీతమ్మ తల్లిని
శ్రీర్రామ చంద్రునికి అప్పగిస్తూ
"ఛాయేవానుగతాసదా" అన్నాడు
సీతమ్మ నీ సహధర్మచారిణి
జీవితాంతం నీకు తోడు నీడ అని
సీతమ్మను రామయ్యకు అప్పగిస్తాడు
నాటినుండి రామయ్య సీతమ్మకు తోడు నీడ
సీతమ్మ శ్రీరామునికి తోడు నీడ
తోడు నీడకు సాక్షీభూతం 
ఆదర్శ దంపతులైన రామయ్య సీతమ్మలు 
మనకు మార్గదర్శకులు


ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments