గుర్రాల ముత్యాల హారాలు
తే.18-8-21 ముత్యాల హారాలు.
576) ఆ నాణెము చెల్లదురా
కుల్ల ఆ పిల్లదిరా
ఆమె గొల్లభామరా
తన ధీమ నీవేరా !
577) ఆశ దురాశ కారాదు
చెప్పకుండా పోరాదు
అప్పుడప్పుడు రారాదు
రాలేక ఉండరాదు !
578) అనుమానం అసలు వద్దు
మీ మాంసం పడవద్దు
నిరాశగాను ఉండొద్దు
నీ ఆశలు వీడొద్దు !
579) చిరునామాను వెతుకు
తపాలా బిల్లలు అతుకు
కవరుపై ఉంది మెతుకు
ఇచ్చేయ్ కవరు సీతకు !
580) తోట అంత పచ్చన
మోట నీళ్ళు వెచ్చన
తీసుకురా నిచ్చెన
ఎక్కితే నేమెచ్చన !
581) పగలు నిద్ర పోరాదు
గుడిసెలోన దూరరాదు
ఇచ్చి మాట మీరరాదు
మోసాన్ని చేయరాదు !
582) గడియారం టిక్కు టిక్కు
అదిగో నీ చెక్కు బుక్కు.
వానిపై వేయి లుక్కు
విన్నావా మా సక్కు !
583) పై నిండా కురుపులు
చేయుగా అవి చెడుపులు
అవుతాయిగ అరుపులు
అవి కలకలం మెరుపులు !
584 పరుపు పైన ఉంది దిండు
చూశారుగా ఇక రండు
వీడు మనకన్నా మెండు
వేగంగా విసిరె చెండు !
585) గోరుపై రోకటి పోటు
అది తెచ్చునుగా చేటు
ఇది నీ గ్రహపాటు
ఇక చేయకు పొరపాటు !
586) ఉయ్యాల కట్టి చూడు
ఊగనీకె ఓ తాడు
వాడుకో నువ్వు నేడు
వాడొస్తాడు నీకు తోడు !
587) వచ్చినవాడు నీ చుట్టం
కట్టు వానికి ఇక పట్టం
మేం ఎవరము గూడ తిట్టం
తిలకము మాత్రం పెట్టం !
588) పనికి ఇయ్యి నీవు విలువ
వస్తారంతా నిన్ను కొలువ
కాదన్న వాడు తులువ
ఎవరు ఉన్నారు పిలువ !
589) వాడు వట్టి బికారిరా
నీవు సాయం చేయరా
నీ బస్తా మోస్తాడురా
నీ వెంటే వస్తాడురా !
590) ఆడవాళ్ళ ముచ్చట్లు
వేస్తున్నరు నాట్లు
పిల్ల వాళ్ళ చప్పట్లు
కొట్టారు వారు తప్పెట్లు !
591) సారీలు చెప్పకండి
గోరీలు కట్టకండి
ఎవరిని తిట్టకండి
మంచి మీరు ఉండండి !
592) వస్తున్నది ఒక లారి
మస్తు ఉన్నది ఈ పోరి
ఎక్కించుకుంటరు కోరి
తప్పిస్తారు వారు దారి !
593) అన్నయ్య వదిన వచ్చారు
పూలహారం తెచ్చారు
నన్ను వారు మెచ్చారు
ఓ బహుమానం ఇచ్చారు !
594) కన్నయ్య మురళి ఇది
మరి బృందావనం ఏది
రాధ చెబుతున్నది సోది
తను కట్టిన చీర ఖాది !
595) మన్ను తిన్న పాము వాడు
ఏవిషయం చెప్పలేడు
కదిలించిన కదలడు
ఎవరినిగూడా వదలడు. !
596) రాము రాజు కవలలు
తొడిగారు కొత్త వలువలు
వారు కారు పలువలు
వారి కున్నవి విలువలు !
597) ఎవరికి వారే వారు
నదీ తీరం చేరారు
స్నానం గావించారు
ప్రయాణం ముగించారు !
598) ముంగిస వచ్చి కరిచింది
మెరుపు కూడా మెరిసింది
అప్పుడు రాత్రి అయ్యింది
ఏదో చప్పడు అయ్యింది !
599) రమణయ్య మావవచ్చాడు
బూరెల మూకుడు తెచ్చాడు
మాకు దాన్ని ఇచ్చాడు
తాను మమ్ముల మెచ్చాడు !
600) వద్దు రావద్దు ముందుకు
చేస్తున్న మా విందుకు
పారిపో ఆ సందుకు
ఆలస్యం చేసినందుకు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.
.