షేర్ మార్కెట్ పితామహుడు "వారెన్ బఫెట్" చెప్పిన ఆర్థిక సూత్రాలు --మార్గం కృష్ణ మూర్తి

షేర్ మార్కెట్ పితామహుడు "వారెన్ బఫెట్" చెప్పిన ఆర్థిక సూత్రాలు --మార్గం కృష్ణ మూర్తి


- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక : షేర్ మార్కెట్  పితామహుడు "వారెన్ బఫెట్ "  (warren Buffett) చెప్పిన  ఆర్ధిక సూత్రాలు :

వృద్ధాప్య దశ  సుఖంగా ,  హాయిగా  గడపా లంటే  చిన్న నాటి నుండే  పొదుపు  , ఆర్ధిక  క్రమ  శిక్షణ  కలిగి ఉండాలి .  షేర్ మార్కెట్ పితామహుడు " వారెన్ బఫెట్ "   సంపద  వృద్ధికి సంబందించి అనేక మైన  సూచనలు  చేశారు. అందులో  ముఖ్యమైనది  ఏమంటే ,  " మనం  కళ్ళు మూసుకుని  హాయిగా  నిద్ర  పోయినా  , నిజాయితీగా  మన సంపద  పెరుగుతూనే  ఉండాలి .  లేనట్లవుతే  మనం జీవించి నంత కాలం  కష్ట పడుతూనే  ఉండాలి " అని అంటారు . వారి  ఆలోచనలను , ఐడియాలను  అర్ధం చేసుకోవడానికే  చాలా  సమయం పడుతుంది . అర్ధం చేసుకుని  అనుసరిస్తే  మాత్రం నిజంగానే  , నిజాయితీగా  సంపదను వృద్ధి  చేసుకోవచ్చు . అలాంటి  వాటిలో ఇది ఒకటి .

ఇది ఎలా సాధ్యమవుతుందో  కూడా  చెప్పాడు . ఎలానంటే ,

01. చిన్న  తనం నుండి  పొదుపును  అలవరచు కోవాలి . అవకాశాన్ని  బట్టి , సంపాదనను బట్టి    కొద్దో గొప్పో  ,డివిడెండ్ లేదా  వడ్డీ కల్సి వచ్చే విధంగా పొదుపు చేస్తూ   ఉండాలి .
02. ఫైనాన్సియల్  ప్లానింగ్  ఉండాలి .
03. అవసరం లేని , అనవసరమైన  విలువైన వస్తువులు  కొన కూడదు .

పొదుపుకు  , బ్యాంకుల సేవింగ్ పథకాలను  గాని ,పోస్టాఫీసుల సేవింగ్ పథకాలను గాని , సరియయిన మ్యూచువల్ ఫండ్స్ ను  గాని, ప్రభుత్వ సెక్యూరిటీలను  గాని ఎంచు కోవచ్చు .  ఇలా చేయడం వలన  , మనం  కళ్ళు మూసుకుని హాయిగా నిద్ర పోయినా , కాలు మీద కాలు వేసుకుని  హాయిగా కూర్చున్నా  సంపద వృద్ధి అవుతూనే ఉంటుంది . ఆ విధంగా  రిటైర్  అయ్యే వయస్సు  అనగా 60 సం . రాల వరకు  పొదుపు చేసుకుంటూ  పోతే , రిటైర్ అయ్యే నాటికీ లేదా  పని చేత గాని నాటికీ లేదా పని దొరకని నాటికీ , పొదుపు చేసుకుంటూ వచ్చిన డబ్బు మరియు  దాని మీద వడ్డీ లేదా డివిడెండ్  ,  పెద్ద మొత్తం  అవుతుంది . దానిని  ఏదేని  బ్యాంకులో గాని , పోస్టాఫీసులో  గాని  డిపాజిట్ చేస్తే  , నెలకు  రూ . లు . 10,000 నుండి  50,000  వరకు  పొందవచ్చు . ( మనం  పొదుపు చేసిన  మొత్తాలు , కాలాన్ని  బట్టి  వడ్డీ ఆధార పడి  ఉంటుంది ) ఎవ్వరి పై ఆధార పడకుండా  , నిజాయితీగా , నిర్భయంగా , హాయిగా జీవించ వచ్చు .  నిద్ర ఆహారాలు మాని , రెక్కలు విరుచుకుని కష్ట పడనవసరం  లేదు .  ఇక్కడ కేవలం  కావలసింది  ఒకే సారి , మంచి ఫండ్స్ లలో పెద్ద మొత్తం లో పెట్టుబడి  లేదా క్రమ బద్ద మైన పెట్టుబడి , అంటే ఎస్ . ఐ . పి . (SIP > SYSTEMATIC INVESTMENT PLAN)విధాన ద్వారా , చిన్న  తనం నుండే  , సంపాదన  ప్రారంభించిన కాలం నుండే  పొదుపు చేయడం అలవర్చు కోవాలి .  కనీసం  15 ,20 సం . రాల పై బడే  పొదుపు కోన సాగిస్తూ ఉండాలి . అప్పుడే పెద్ద మొత్తం చేతికి అందు తుంది . దీనికోసం 'లాక్ ఇన్  పీరియడ్'  ఉన్న 'స్కీమ్' లను ఎంచు కోవడం  మరీ మంచిది . 

అయితే , ఇక్కడ  ముఖ్యంగా  పొదుపు విషయంలో పాటించాల్సినవి  చాలా  ఉన్నాయి .  లేనట్లయితే  సక్రమంగా  పొదుపు చేసుకుంటూ పోయినా , లేదా ఒకే సారి డిపాజిట్ చేసి  రిటైర్ అయ్యేంత వరకు  కూచున్నా , నష్టపోయే పరిస్థితి  కూడా ఏర్పడ వచ్చు . ఏ పొదుపు నైనా అప్పుడప్పుడు  గమనిస్తూ , మారుస్తూ ఉంటే , నష్టపోకుండా మరియు మరింత అభి వృద్ధి సాదించ వచ్చు . 
జాతీయ బ్యాంకులలో  పోస్టాఫీసులలో  పొదుపు చేస్తే అసలుకు  ముప్పు లేక పోవచ్చు  గాని  వడ్డీ రేట్లు  మారుతుంటాయి . ప్రభుత్వ పాలసీలను బట్టి , ద్రవ్యోలభనాన్ని బట్టి , నగదు సరఫరాను బట్టి  వడ్డీ రేట్లు  తగ్గ వచ్చు , పెరగ వచ్చు .
కాని  మ్యూచువల్ ఫండ్స్ విషయాలలో  అలా కాదు . మ్యూచువల్ ఫండ్స్ లలో  అనేక రకాలు ఉన్నాయి . లాంగ్ టర్మ్ అని , బ్యాలన్సుడ్  అని , డైవర్సిఫైడ్ అని , సెక్టార్ ఫండ్స్ అని , లిక్విడ్ ఫండ్స్ అని , డెట్  ఫండ్స్ అని  చాలా రకాలుగా ఉంటాయి . మ్యూచువల్ ఫండ్స్ లోని  పెట్టు బడులను , మరల  ఫండ్ మేనేజర్లు , షేర్లలో , ప్రభుత్వ సెక్యూరిటీలలో , కాల్ మనీలో  పెట్టుబడులు పెడుతారు . షేర్ మార్కెట్ అనేది  చాలా సెన్సిటివ్ . ఎలా గంటే  ప్రధాన మంత్రికి  జలుబు చేసిన , అతి వృష్టికి ,  అనావృష్టికి, బడ్జెట్ కు , ఎన్నికలు వచ్చి నప్పుడు , ఆర్ . బి . ఐ . గవర్నర్ మారినా , వార్స్  వచ్చినా , ద్రవ్యోల్భణం  పెరిగినా , తగ్గినా , ఇండస్ట్రియల్  ఇండెక్స్  లు పెరిగినా తగ్గినా , కంపెనీల లాభాలు పెరిగినా తగ్గినా , కంపెనీల యాజ మాన్యాలు  మారినా , ఫారెన్ రిజర్వ్స్  పెరిగినా తగ్గినా , విదేశాలలో  ప్రభుత్వాలు మారినా , దేశ విదేశాలలో  , ప్రభుత్వ పాలసీలు మారినా , మరెన్నో ఇతర కారణాల వలన , షేర్ మార్కెట్  చలించి పోతుంది.  ఇలాంటి  విషయాలన్నీ  ఫాస్ట్ గా  మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లకు మాత్రమే ముందుగా  తెలుస్తాయి . వారికీ  అంత గొప్ప నెట్ వర్క్  ఉంటుంది . భవిష్యత్తును  చక్క గా  అంచనా వేయ గలుగుతారు . అది సామాన్యులకు వీలు కాదు . అందుకనే  మంచి  పెర్ఫామెన్స్  గల , మంచి  నెట్ వర్క్ గల , నిజాయితీ యాజమాన్యం గల  ఫండ్లను మాత్రమే ఎన్నుకోవాలి . ఒక్కో సారి  మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు మంచివే అయినా , స్కీమ్ లు  తేడాలు ఉండ వచ్చు . అప్పుడు వారు కూడా ఏమి చేయ లేరు .  దానికి  మన తెలివి తేటలను కూడా ఉప యోగించి  మంచి  మ్యూచువల్ ఫండ్స్ ను , మంచి  స్కీమ్ లను  మనమే  ఎంచుకోవాలి . అవసరమయితే ఫైనాన్సియల్  అడ్వైజర్స్  సలహాలను , సూచనలను తీసుకుంటూ ఉండాలి.        

కొన్ని ఉదాహరణలు చూద్దాం :

01. డాను  అనే అతను  8, అక్టోబర్ 1995 లో  " Reliance Growth Fund(G)"        అనే మ్యూచువల్ ఫండ్ లో రూ .లు . 1,00,000/- ఒకే సారి  పెట్టుబడి పెట్టాడు .  ప్రారంభంలో కాబట్టి  రూ . లు . 10/- చొప్పున  10,000 యూనిట్లు  కొన్నాడు .  ఈ రోజున అనగా 17. 02. 17  న  ఒక్కొక్క యూనిట్ ధర కాస్తా  రూ . లు . 813.21 అయ్యింది .  10,000 యూనిట్ల విలువ రూ . లు . 81,32,100/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 6,83,096/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 56,925/- వచ్చాయి. డాను హాయిగా , నిజాయితీగా  , ఎవ్వరి పైనా ఆధార పడకుండా జీవిస్తున్నాడు . 

02. సోను  అనే అతను  1, డిసెంబర్ 1993 లో  " Franklin India Mid Cap Fund(G)"        అనే మ్యూచువల్ ఫండ్ లో రూ .లు . 1,00,000/- ఒకే సారి  పెట్టుబడి పెట్టాడు .  ప్రారంభంలో కాబట్టి  రూ . లు . 10/- చొప్పున  10,000 యూనిట్లు  కొన్నాడు .  ఈ రోజున అనగా 17. 02. 17  న  ఒక్కొక్క యూనిట్ ధర కాస్తా  రూ . లు . 921.77 అయ్యింది .  10,000 యూనిట్ల విలువ రూ . లు . 92,17,700/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 7,74,287/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 64,524/- వచ్చాయి. సోను హాయిగా , నిజాయితీగా  , ఎవ్వరి పైనా ఆధార పడకుండా జీవిస్తున్నాడు . 

03.  భాను  అనే అతను  1, డిసెంబర్ 1993 లో  " బ్యాంకు లోనో , పోస్టాఫీసు లోనో , ప్రభుత్వ సెక్యూరిటీల లోనో " రూ .లు . 1,00,000/- ఒకే సారి  ఫిక్సుడ్  డిపాజిట్ చేసాడు.   8%  వార్షిక  వడ్డీ  వృద్ధి చొప్పున , ఈ రోజున అనగా 17. 02. 17  న  రూ . లు . 5,87,146/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 49,320/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 4,110/- వచ్చాయి. భాను  నార్మల్ గా  జీవిస్తున్నాడు . 

04. ఇక వేణు అనే అతను  1, డిసెంబర్ 1993 లో  ఎడా  పెడా  కన పడిన ప్రతి షేర్లల్లో  రూ  . లు .  10/- చొప్పున  100 కంపెనీలలో  రూ .లు . 1,00,000/-   పెట్టుబడి పెట్టాడు . ప్రారంభంలో కాబట్టి  రూ . లు . 10/- చొప్పున 100 కంపెనీలలో   10,000 షేర్లు   కొన్నాడు .  ఈ రోజున అనగా 17. 02. 17  న  ఆ 80 కంపెనీలు  అడ్రస్ లేకుండా కాను మరుగయినాయి . ఇక మిగిలిన 20 కంపెనీల షేర్లు  విలువ రూ . లు . 1,46,000/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 12,264/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 1,022/- వచ్చాయి. వేణు  రోజూ పని చేస్తూనే  జీవిస్తున్నాడు . 

05. శీను   అనే అతను  1, ఏప్రిల్  1995 లో  " JM Balanced Fund (G)"        అనే మ్యూచువల్ ఫండ్ లో రూ .లు . 1,00,000/- ఒకే సారి  పెట్టుబడి పెట్టాడు .  ప్రారంభంలో కాబట్టి  రూ . లు . 10/- చొప్పున  10,000 యూనిట్లు  కొన్నాడు .  ఈ రోజున అనగా 17. 02. 17  న  ఒక్కొక్క యూనిట్ ధర కాస్తా  రూ . లు . 40.06 అయ్యింది .  10,000 యూనిట్ల విలువ రూ . లు . 4,00,600/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 33,650/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 2,804/- వచ్చాయి. శీను  రోజూ పని చేస్తూనే జీవించాల్సి వస్తున్నది 



06. రేను   అనే ఆమె   29, సెప్టెంబర్  1994 లో , నా వద్ద అంత డబ్బు ఒకే సారి ఎక్కడ వున్నాయి , నేను నెలకు రూ . లు . 1,000/- వర్కకే పొదుపు చేయ గలను అని  " Franklin India Prima Plus  Fund(G)"      అనే మ్యూచువల్ ఫండ్ లో రూ .లు . 1,000/- క్రమాను గత పొదుపు విధానం ద్వారా (SIP) పెట్టుబడి ప్రారంభించింది . అది ఈ రోజు , 14% వార్షిక వృద్ధి చొప్పున    రూ . లు . 17,67,000/- దీనిని 8.% చొప్పున డిపాజిట్ చేస్తే , సాలుకు   రూ . లు . 1,48,428 వస్తుంది .  10,000 యూనిట్ల విలువ రూ . లు . 81,32,100/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 1,48,428/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 12,369/- వచ్చాయి. రేను  మాములుగా  జీవిస్తుంది  . 

07. జాను   అనే అతను  29, సెప్టెంబర్  1994 లో  " Franklin India Prima Plus  Fund(G)"    అనే మ్యూచువల్ ఫండ్ లో రూ .లు . 1,00,000/- ఒకే సారి  పెట్టుబడి పెట్టాడు .  ప్రారంభంలో కాబట్టి  రూ . లు . 10/- చొప్పున  10,000 యూనిట్లు  కొన్నాడు .  ఈ రోజున అనగా 17. 02. 17  న  ఒక్కొక్క యూనిట్ ధర కాస్తా  రూ . లు . 502. 52   అయ్యింది .  10,000 యూనిట్ల విలువ రూ . లు . 50,25,200/- అయ్యింది . దీనిని  ఏ  పోస్టాఫీసు లోనో  డిపాజిట్ చేస్తే  ,  8.4 %  వడ్డీ  చొప్పున , సాలుకు రూ . లు . 4,22,116/- వచ్చాయి  . అదే నెలకు చూస్తే , రూ . లు . 35,176/- వచ్చాయి. జాను  హాయిగా , నిజాయితీగా  , ఎవ్వరి పైనా ఆధార పడకుండా జీవిస్తున్నాడు . 

N.B: THE ABOVE ARE ALL EXAMPLES ONLY. ALL THE  INVESTMENTS ARE  SUBJECT TO  MARKET CONDITIONS AND RISKS. BEFORE INVESTING PLEASE READ THE RELATED DOCUMENTS CAREFULLY AND TAKE THE ADVICE OF YOUR NEAREST FINANCIAL ADVISER AT YOUR OWN RISK & RETURNS.  

- మార్గం కృష్ణ మూర్తి

0/Post a Comment/Comments