కృష్ణంవందే జగద్గురుం
దేవకీ వసుదేవుల పుత్రుడుగా
చెరసాల లో జననము
యమునలో పయనించి
యశోద నందుల ఇంట
అల్లారు ముద్దుగా పెరిగిన
బాలకృష్ణుని అల్లరి ఆటలు
జగానికి జనానికి పాటలు
నిదురిస్తున్న బాలకృష్ణుడు
ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తి రూపము
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం
అవతరించిన కృష్ణావతారం
దశావతారాలలో ఒకటైన కృష్ణ
మూర్తి ప్రజల హృదయాలను
తన సుందర మహిమలతో
అనన్య లీలలతోరంజింప చేసి నమహానుభావుడు..
యోగనిద్రలో ని బాల కృష్ణుడు
ప్రజల సుఖసంతోషాలకు ఆలోచన
పవళింపు లో పరవశపు నిద్ర..
భాగవత నాయకా ప్రజల హృదయాలలో
నిలిచిన ప్రేమమూర్తి అనిర్వచనీయమైన
నీ ప్రేమను పొందిన గోపికలు
..మధురదీపికలు.. కారణ జన్ముడివై
భగవద్గీతను అందించి...
నీ విశ్వరూపం చూపిన అఖండదివ్యస్వ రూపిడివి....
నీ పాదాలకు శత సహస్ర ప్రణామములు...
నీ దివ్యమంగళ స్వరూపానికి అక్షర నీరాజనాలు..
పేరు: శ్రీ మతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి 94 90 2 3 95 81
ప్రక్రియ:వచనం