తేట తెలుగు
తేది:10/08/2021
పేరు:పసుల లాలయ్య
ఊరు:అనంతపూర్, వికారాబాద్
చరవాణి: 7893999525
తెలుగు భాషకు తెగులు
తలుచుకుంటేనే దిగులు
ఆవేదనతో తెలుగు
తల్లి గుండెయే పగులు
తెలుగు తేనెల ఊట
తేట పలుకుల మాట
బతుకు చూపెడి బాట
తెలుసుకోరా తెలుగు తమ్ముడా
మాటలాడినా చాలు
మంచి ముత్యపు జల్లు
మధుర భాషణ యందు
మాత్రృభాషయె మేలు
అమెరికాలో తెలుగు
అద్బుతంగా వెలుగు
అటువంటి వైభవము
మనకు ఎప్పుడు కలుగు
తెలుగేలచేదురా తెలుగుమనకీర్తీ రా
అమ్మభాషను మించి అవనిలో లేదురా
దేళభాషలందు తెలుగు లెస్స అని గుర్తుంచుకోరా సోదరా!