"సహస్ర రత్న" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం-అభినందలతో ప్రవాహిని

"సహస్ర రత్న" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం-అభినందలతో ప్రవాహిని

"సహస్ర రత్న" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం

పెద్దకడబూరు మండలంలోని, హిస్సారమురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'సహస్ర రత్న' బిరుదు వరించింది.బాలసాహిత్యంలో  పలు పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా,బాలలచే రచనలు చేయిస్తూ, 'పసి(డి) హృదయాలు ' బాలసాహిత్య వేదికను ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఖాతాలో మరొక అవార్డు జమ కావడం విశేషం.శ్రీ దేవ యనగందుల గారు రూపొందించిన షాడోస్ తెలుగు లఘు కవితాప్రక్రియలో పది వందల(వెయ్యి) మినీ షాడో గేయకవితలు అనతి కాలంలో వ్రాసినందుకుగాను భువన విజయం తెలుగు సాహిత్య వేదిక,తెలంగాణ రాష్ట్రం వారు కరోనా దృష్ట్యా జూమ్ సమావేశంలో  "సహస్ర రత్న" బిరుదును సోమన్నకు  వాట్సప్ గ్రూప్ ద్వారా అందజేశారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులందరూ అభినందించారు.


0/Post a Comment/Comments