సమాజ నిర్మాత
కవి నవ సమాజ నిర్మాత
కవి యువత కి ఉత్తేజం
కవి అందరికి ఆదర్శం
కవి సంఘ సంస్కర్త
కవి సుగుణాల ప్రతీక
కవి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దేశాన్ని నడిపించే సారథి
కవి కలం నిరంతర అక్షర ప్రవాహం...
కవిసాహిత్యం చైతన్య స్రవంతి
కవి వ్యక్తిత్వం ఎందరికో మార్గదర్శకం..
కవి సమాజ రుగ్మత ల వైద్యుడు
కవి సంఘ దురాచారాలను మూఢత్వం నివారించే నిపుణుడు
రవి గాంచని ది కవి గాంచును
కవి విప్లవ భావాల వీరుడు
కవి అంధకారాన్ని రూపు మాపి
కలంతో వెలిగే సూర్యుడు
చరిత్రలో ఎందరో కవులు
దేశం కోసం సాహిత్యంతో పోరాడి గెలిచిన ఘనులు..
తరతరాల కవులు.
మన తరానికి సిరులు
సువర్ణాక్షరాలతో నిలిచిన కవులు...
నేటి కవులు కళామతల్లిని సాహిత్య మాతను వ్యాపార
వినియోగం చేస్తున్నారు...
కూడదు అది...కవి లక్ష్యం కాదు...
ఎందరికో ప్రేరణ నిచ్చే కవి కాసులకు ఆశ కూడదు
మహాకవి పోతనను మరిచారా
జగతికి జీవమైన కవులు
జనులకు మార్గ నిర్దేశం కావాలి
ఎందరో మహాకవులు...
అందరికి వందనాలు...
పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి :9 4 9 0 2 3 9 58 1