ఎదిగి ఒదుగు..!(కవిత),ముహమ్మద్ ముస్త ఖీమ్ విన్నర్

ఎదిగి ఒదుగు..!(కవిత),ముహమ్మద్ ముస్త ఖీమ్ విన్నర్

ఎదిగి ఒదుగు..!(కవిత)


ఎంత ఎదిగినా.. 
అంత ఒదిగి ఉండడంలో మన విజ్ఞత దాగి ఉంటుంది..!
సంఘంలో మనిషి 
గౌరవాదరాలు..
సౌమ్యంగా వ్యవహరించడంలోనే ఉన్నాయి..!
నిరాడంబర జీవనం నేర్చుకొని,
ఉన్న దాంట్లోనే సంతృప్తి వెతుక్కుని, 
ముందుకు వెళ్ళడంలోనే, విజ్ఞత దాగిఉంది..!
ఎన్నెన్నో వస్తువులు సమకూర్చుకొని.. 
అదే జీవితం అన్నట్లు వ్యవహరించడం.. 
అంత ఒప్పుకోతగినది కాదేమో..!?
ఎందుకంటే వస్తువుల్లో దొరికేది నిజమైన ఆనందం కాదు..
అదొక "కోరిక" నెరవేర్చుకున్న ట్టు..!అంతే కాని,
నిజమైన సంతోషం మదిలో పుడుతుంది..!
అదొక అలౌకిమైన ఆనందం..!?

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments