అపురూపం మనకు అమ్మ
అపురూపం మనకు అమ్మ
రానీయకు కంటి చెమ్మ
ఆమె కంట ఆనందమే
నీ బతుకుకు అర్థం అమ్మ
అద్దంలో చందమామ
ఆకలిలో తల్లి ప్రేమ
చూపినట్టి అమ్మ ను ఇపుడు
మనము ఆదరించలేమ
అమ్మ కప్పిన కొంగు
ఆకాశం దాని రంగు
ఆ క్షణం తలచుకుంటే
ఆనందమున ఎదపొంగు
తన ఒడిలో పెంచెను నిన్ను
తన ప్రేమే నీకు వెన్నుదన్ను
నీ ఉన్నతికి సరిహద్దని
చూపుతుంది నీకు కన్నా మిన్నా
అమ్మ ఇచ్చినట్టి పాలు
అయ్యెను నేడు నేల పాలు
ఆమె పలకరింపు లేక
నేడు తల్లి అయ్యెను ఆశ్రమాలపాలు
పేరు:పసుల లాలయ్య
గ్రామం: అనంతపూర్, మం:బొంరాస్పేట్
జిల్లా: వికారాబాద్ చరవాణి: 7893999525