అభ్యుదయ పుష్పం...! _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అభ్యుదయ పుష్పం...! _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అభ్యుదయ పుష్పం...!
_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

తెలంగాణ ప్రజల  కన్నీళ్ళను
అగ్నిధారగా  మలిచి 
నిజాం నిరంకుశ పాలన పై
ఎక్కు పెట్టిన విప్లవ శరధి...!

పద్యాన్ని పదునైన ఆయుధంగా ధరించి
తెలంగాణ విముక్తి కోసమై
ఇందూరు కోటలో ఖైదీ ఐన
అభ్యుదయ ఆంధ్ర కవితా సారథి...!

నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని
గర్వంగా తల ఎత్తి గర్జించిన కంఠీరవం
బడాచోర్ రజాకార్ల దౌర్జన్యాల పై సమర శంఖం పూరించి
రుద్ర వీణ మీటిన తెలంగాణ వారధి...!

ఇదే మాట ఇదే మాట పదే పదే  అనేస్తాను
వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా అంటూ
భావ ప్రేరిత ప్రసంగ జ్వాలతో రగిలించిన చైతన్య దివిటి 
చిన్న గూడూరు లో వికసించిన అభ్యుదయ పుష్పం
తెలంగాణ సాహితీ నిధి దాశరథీ..!

హామీ  పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments