అక్షర స్నేహం ...శ్రీమతి సత్య మొం డ్రేటి

అక్షర స్నేహం ...శ్రీమతి సత్య మొం డ్రేటి

అక్షరం క్షరం కానిది..
విద్య యే వింత ధనం
విద్య లేని వాడు వింత పశువు
క్లాస్ లో మాస్టారు విద్యను గురించి వివరించి చెబుతున్నారు సామెతల తో సహా...
కర్ణ కి మాత్రం మాస్టారు మాటలు ఏవి చెవికి ఎక్కడం లేదు... త్వరగా స్కూల్ నుండి ఇంటికి వెళ్లి గ్రౌండ్ లో ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి.. అదే ఆలోచన..కర్ణ స్నేహితుడు కృష్ణ
ఎపుడు పుస్తకం వదిలేవాడుకాదు...మాస్టారు చెప్పిన పాఠాలే కాదు ఆయన చెప్పిన జీవిత పాఠాలు కూడా ఎంతో శ్రద్ధగా వినేవాడు... కర్ణ కృష్ణ స్నేహము ఎంతో గొప్పది
విద్య విషయంలో తప్పితే వారిద్దరు ఒకే కంచం,ఓకే మంచం లాంటి స్నేహం వారిది
కృష్ణ కుచేల లా ఆర్థిక భేదం లేదు..ఇద్దరు మధ్యతరగతి వాళ్ళే.... ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు.. కర్ణ క్రికెట్ ఆటగాడు అవుతానని చదువును పట్టించుకోలేదు.. అటు క్రికెట్లోనూ రాణించలేదు..

అప్పుడు గుర్తొ
చ్చాయ్ మాస్టర్ మాటలు విద్య... వింత ధనం.
కృష్ణ తన విద్యతో ఉన్నత స్థానాన్ని అధిరోహించి జీవన పదాన్ని బంగారు బాటగా మలుచుకున్నాడు... అక్షరాన్ని పణంగా పెట్టి ధనాన్ని సంపాదించాడు...... దేశానికి ఉపయోగపడే రీతిలో కర్మాగారాన్ని నిర్మించి  అందరికీ ఉపాధి కల్పించాడు...
కర్ణ  జీవితంలో 

నిలదొక్కుకోడానికి తగిన విద్య లేక వ్యాపారానికి తగిన పెట్టుబడికి ధనం లేక అల్లకల్లోల జీవితంతో నిస్సహాయుడు గా నిలిచాడు.. స్నేహితుడు పరిస్థితి తెలుసుకున్న కృష్ణ కర్ణ కితన కర్మాగారం లో ఉపాధి చూపించాడు. అక్షరం యొక్క విలువ, ఉపయోగాన్ని తెలుసుకుని , కర్ణ వయోజన విద్య  విద్య ద్వారా  విద్యాధికుడిగా  సాంకేతిక  నిపుణుడిగా మారి‌ కృష్ణ తో సరి సమానంగా ఎదిగాడు.. కర్ణ కృష్ణల స్నేహం కలకాలం వర్ధిల్లింది... అక్షరమే వారికి జీవితాన్ని ఇచ్చింది.....


పేరు శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1
హామీ పత్రం:  అక్షర స్నేహం అనే కథానిక నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.

0/Post a Comment/Comments