"యోగా గురు - సద్గురు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"యోగా గురు - సద్గురు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

యోగా గురు - సద్గురు


రాచనగరి మైసూరుగడ్డపై 
సాధారణ తెలుగు కుటుంబంలో 
జగదీశ్ నామధేయుడుగా పెరిగి 
ప్రకృతిపై ఆసక్తిని పెంచుకుని 
యోగవిద్య నేర్చుకుని 
చాముండి కొండపై ఆధ్యాత్మిక 
అనుభవం పొంది దాని అంతరార్థం 
తెలియక ఆరాటపడిన వ్యక్తి 
తాను సంపాదించిన ధనాన్ని 
స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చే
రివాజు జగ్గీ వాసుదేవుడిది 
దివ్యమైన నిరాకార స్వరూపమనే 
ఈశా సంస్థను స్థాపించి 
అన్నిమతాల ఏకత్వాన్ని చాటే 
ధ్యానలింగ యోగాలయం నిర్మించి 
సామాజిక అభివృద్ధికోసం 
అహర్నిశలు ప్రవచనాలు చేస్తూ 
యోగవిద్యపై , పర్యావరణ సంరక్షణపై 
పేదప్రజల ఆరోగ్యజీవనంపై 
అవగాహన కల్పిస్తూ 
ఆధాత్మిక చైతన్యం కోసం 
శ్రమిస్తున్న యోగగురు 
 మార్మికతను చాటిన సద్గురు 
పద్మ విభూషణుడిగా 
అంచెలంచెలుగా ఎదిగిన తెలుగు బిడ్డ


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments