అందమైన దాంపత్యం : శ్రీమతి ఐశ్వర్య రెడ్డి

అందమైన దాంపత్యం : శ్రీమతి ఐశ్వర్య రెడ్డి


దాంపత్య బంధం


మూడు ముళ్ళు ఏడు అడుగులు 
నూరేళ్ల బంధానికి సాక్షాలై 
ఇద్దరినీ ఒకటి చేసే కళ్యాణం కడు కమనీయం 
మనసులతో ముడి వేసుకొని తనువుల తో 
తన్మయత్వం పొంది పరవశించి 
పయనించేదే దాంపత్యం,
యవ్వనం జోరులో ఒకరు 
పాదాల వెంట ఒకరి పరుగులు, 
ఓర చూపుల సోయగాలు ,
పరువాల సయ్యాటలు లతో సాగే సంబరం
నడివయసులో బాధ్యతల భవసాగరాలు 
భావోద్వేగాల అలజడులు రేగినా 
నమ్మకమే పునాది గా సాగే సంసారం 
అదే ఆలుమగల మమకారం
ఒకరితో ఒకరు మమేకమై 
కలిమిలేములు కష్టసుఖాలను కలిసి పంచుకోని ,
కడ వరకు తోడు నిలిచి కాపాడే బందం దాంపత్యం. 
అన్ని బందాలను ఒకే బందంలో 
ముడి వేసుకుని మురిసిపోయే సాంగత్యం. 
ఒకరికి ఒకరై ఇద్దరిదీ ఒకే లోకమై 
జన్మ జన్మల బంధమై పండించే నూరేళ్ల స్నేహం,
మూడు ముళ్ళతో వేసే వీలునామా
చెరిగిపోని పవిత్రతకు చిరునామా 
అదే దాంపత్యం. 
అదే అదే వివాహ బంధం.

పేరు: ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్

1/Post a Comment/Comments

Post a Comment