నిజమైన స్నేహం..

నిజమైన స్నేహం..

నిజమైన స్నేహం..

నిజమైన స్నేహం కోసం
అన్వేషణ కోనసాగిస్తూ
ఆలోచించా?
స్నేహం అంటే ఏమిటి అని....
ఒకరి అవసరం కోసం ఒకరు చేసేది 
నిజమైన స్నేహమా
ఎవరి దగ్గర డబ్బు వుంటుందో
వారితో చేసే స్నేహం నిజమైనదా
ఎవరి దగ్గర పదవి వుందో
వారితో స్నేహం నిజమైనదా
ఇలా ఆలోచన కోనసాగించిన
అన్వేషణలో...
అవసరం కాని ,
డబ్బు కాని ,
పదవి కాని
ఏది శాశ్వతం కాదు...
ఇవి చూసి చేసిన స్నేహం మరి శాశ్వతమా ?
మరి నిరపేక్ష  స్నేహం ఎక్కడా
మనలో ఏది ఆశీంచా కుండా
మన శ్రేయస్సు
మన క్షేమం కోరే నిరపేక్ష స్నేహం ఎక్కడా
అని అన్వేషించి ఆలోచించా....
స్వచ్చమైన గాలి
శుద్ధమైన నీరు
సారవంతమైన భూమి
తేజోమయ ఎండ
ఇలా మన ప్రతి వికాసంలో
నిరపేక్ష, నిరాకాంక్ష ప్రేమను 
స్నేహన్ని అందించెది "ప్రకృతి"
కాబట్టి 
నా నిజమైన స్నేహం ప్రకృతి
నిస్వార్ధమైన
నిరపేక్ష స్నేహమే 
నిజమైన స్నేహం....

      ✍️శ్రీపాల్.....

0/Post a Comment/Comments