తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో....
.....నా మది పలికిన భావం.....
నా మదిని తాకిన భాషామృత ప్రేమ
మెల్లగా నా మదిని వీడి
తీయనైన తెలుగు అక్షరమాలగా
పరిమళిస్తూ ,పరిమళిస్తూ
నాతో ముచ్చటగా ఇలా పలికింది...
కనుమరుగవుతున్నా నా అస్తిత్వాన్ని
సుందరమైన అక్షర జ్ఞానాన్ని
తియ్యనైన తేనె వోలె
అక్షరనై
వాక్యనై
పద్యనై
మాతృ స్పర్శ భావానై
మదిని వీడినే పరిమళిస్తె
నను వీడి పరభాషకై పాకులాడి
తల్లి భాషను మరిచితివా
మాతృభాష ఘనకీర్తిని మరిచి
ఈ మట్టి భాష పరిమళాన్ని విడిచి
నీలోని రసజ్ఞతను తీయలేక
పరభాషే జ్ఞానం అనుకొని
తల్లి ప్రేమనే తెలుసుకో లేక పోయావా
ఓ తెలుగువాడ...
శ్రీపాల్
8978894808